Begin typing your search above and press return to search.

1000 కోట్లు.. ఒక్క మూవీతో అవ్వలేదు కానీ..

ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో మలయాళం ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సినిమాల ద్వారా సాధించారు. ఒక్క సినిమాతో ఈ ఫీట్ సాధ్యం కాలేదు.

By:  Tupaki Desk   |   22 May 2024 4:02 AM GMT
1000 కోట్లు.. ఒక్క మూవీతో అవ్వలేదు కానీ..
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెయ్యి కోట్ల కలెక్షన్ అనేది ప్రస్తుతం పెద్ద విషయంగా అనిపించడం లేదు. ఇప్పటికే ఏడు ఇండియన్ మూవీస్ వెయ్యి కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. అలాగే రెండు, మూడు సినిమాలు వెయ్యి కోట్ల దగ్గరకి వచ్చి ఆగిపోయాయి. 500 కోట్లకి పైగా కలెక్షన్స్ అనేది ఈజీ అయిపొయింది. స్టార్ హీరోల మూవీస్ మార్కెట్ 400 నుంచి 500 కోట్ల వరకు ఇండియాలో జరుగుతోంది.

అయితే ఇదంతా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల వరకే. ఈ మూడు పరిశ్రమలతో పోల్చుకుంటే మలయాళీ చిత్రపరిశ్రమ చిన్నది. సినిమాల బడ్జెట్ కూడా భారీగా ఉండవు. ఇప్పుడిప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్స్ బడ్జెట్ పరంగా లిమిటేషన్స్ దాటుతున్నారు. అయితే మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళంలో సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడి దర్శకులు కొత్త కొత్త కథలతో మూవీస్ చేస్తూ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు.

ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో మలయాళం ఇండస్ట్రీ ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ సినిమాల ద్వారా సాధించారు. ఒక్క సినిమాతో ఈ ఫీట్ సాధ్యం కాలేదు. చిన్న బడ్జెట్ చిత్రాలుగా కొన్ని మూవీస్ ప్రేక్షకుల ముందుకొచ్చి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్నాయి. ఇవన్నీ కలిసి వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించాయి. వీటిలో టాప్ లో మంజుమ్మల్ బాయ్స్ మూవీ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. ఈ సినిమా 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది.

అలాగే చిన్న సినిమాగా వచ్చిన ప్రేమలు మూవీ 100 నుంచి 150 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. రీసెంట్ గా వచ్చిన ఫాహద్ ఫాజిల్ మూవీ ఆవేశం కూడా ఇప్పటి వరకు `150 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్ బస్టర్స్ తో పాటు మరికొన్ని మూవీస్ హిట్ టాక్ తో సాలిడ్ కలెక్షన్స్ సాధించాయి.

ఇవన్నీ కలిపి ఇండియాలో 660 కోట్లు కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ 360+ కోట్లకి పైగా వసూళ్లు సాధించాయి. ఓవరాల్ గా చూసుకుంటే 1000+ కోట్లకి పైగా మలయాళం ఇండస్ట్రీ సినిమాలు ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే సాధించాయి. మంజుమ్మల్ బాయ్స్ తమిళ్ వెర్షన్ అయితే దేశ వ్యాప్తంగా 50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ప్రేమలు తెలుగు వెర్షన్ 15 కోట్ల వసూళ్లతో మలయాళీ చిత్రాల స్టామినాని పరిచయం చేశాయి. మలయాళీ మూవీస్ కి ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో డిజిటల్ రైట్స్ రూపంలో కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం.