Begin typing your search above and press return to search.

మాలీవుడ్ ని టాలీవుడ్డే లేపుతుందా?

సాధార‌ణంగా మ‌ల‌యాళం కంటెంట్ ఆ రాష్ట్రానికే ప‌రిమితం అవుతుంది. కానీ కొంత కాలంగా అక్క‌డ సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వ‌డం.. లేదా అనువాదా రూపంలో రిలీజ్ అవ్వ‌డం జ‌రుగుతుంది.

By:  Tupaki Desk   |   9 March 2024 4:30 PM GMT
మాలీవుడ్ ని టాలీవుడ్డే లేపుతుందా?
X

మాలీవుడ్ కంటెంట్ పాన్ ఇండియాలో సంచ‌ల‌నమ‌వుతోన్న వైనం తెలిసిందే. ప‌రిమిత బ‌డ్జెట్ లో నిర్మాణ‌మైన సినిమాలు కోట్ల వ‌సూళ్ల‌ని సాధిస్తున్నాయి. సాధార‌ణంగా మ‌ల‌యాళం సినిమా 50 కోట్లు వ‌సూళ్లు సాధిస్తే ఎక్కువ‌. కానీ ఇప్పుడక్కడ సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్లు రాబ‌డు తున్నాయి. అక్క‌డ చిత్రాల‌కు పాన్ ఇండియాలోనూ మంచి గుర్తింపు ద‌క్కుతుంది.

మ‌రి అందుకు కార‌ణంగా టాలీవుడ్ నా? మ‌న ప‌రిశ్ర‌మే మ‌ల‌యాళం చిత్రాల్ని హైలైట్ చేస్తుందా? అంటే అవుననే అనాలి. సాధార‌ణంగా మ‌ల‌యాళం కంటెంట్ ఆ రాష్ట్రానికే ప‌రిమితం అవుతుంది. కానీ కొంత కాలంగా అక్క‌డ సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వ‌డం.. లేదా అనువాదా రూపంలో రిలీజ్ అవ్వ‌డం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో ఆ ఒర‌వ‌డి మ‌రింత పెరిగింది. కంటెంట్ ఉన్న అన్ని సినిమాల్ని టాలీవుడ్ డంప్ చేస్తుంది.

అక్క‌డ స్టార్స్ న‌టించిన చిత్రాల్ని ఇక్క‌డ స్టార్స్ తో రీమేక్ చేస్తున్నారు. కుద‌ర‌ని పక్షంలో రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. డిజిట‌ల్ రైట్స్ సైతం ముందే మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ల‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించి సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు కొంద‌రు నిర్మాత‌లు. వీట‌న్నింటికంటే ముందు ఓ మాలీవుడ్ సినిమా టాలీవుడ్ కి వ‌చ్చిందంటే? ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. వీర‌లెవల్లో ఆ సినిమా గురించి ప్రచారం జరుగుతుంది.

ఆ సినిమాలో విష‌యం ఉందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ముందు జ‌నాల్లోకి బ‌లంగా తీసుకెళ్లే బాధ్య‌త‌ని మాత్రం నెత్తిన వేసుకుని మోస్తున్నారు. ప్ర‌ధానంగా ఈ కార‌ణంతోనే మ‌ల‌యాళం సినిమాకి పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కుతుంది.

టాలీవుడ్ క్రేజ్ న‌డుమ మల‌యాళం సినిమా ఈజీగా జ‌నాల్లోకి వెళ్తుంది. మ‌ల‌యాళం లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన తెలుగులోనూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ రెండు మ‌ల‌యాళ సినిమా రైట్స్ ని ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.