సినీ ఇండస్ట్రీలో మళ్ళీ డ్ర*గ్స్ కలకలం.. దొరికిపోయిన టాలెంటెడ్ దర్శకులు
సినిమా ఇండస్ట్రీలో డ్ర*గ్స్ కేసు మళ్ళీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం కొచ్చిలోని గోశ్రీ బ్రిడ్జి సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో హైబ్రిడ్ గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
By: Tupaki Desk | 27 April 2025 5:09 PM ISTసినిమా ఇండస్ట్రీలో డ్ర*గ్స్ కేసు మళ్ళీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం కొచ్చిలోని గోశ్రీ బ్రిడ్జి సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లో హైబ్రిడ్ గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు టాలెంటెడ్ మలయాళ దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా కూడా అరెస్టు అయ్యారు. వీరితో పాటు షలీఫ్ మహ్మద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి సీక్రెట్ సమాచారం మేరకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులు 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి, అరెస్టు చేసిన ఫ్లాట్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్‌కు చెందినదిగా గుర్తించారు. అకస్మిక దాడిలో ముగ్గురినీ పట్టుకున్న అధికారులు, అనంతరం వైద్య పరీక్షలు జరిపారు. తాజాగా సమాచారం ప్రకారం, ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా ఇద్దరూ వైద్య పరీక్షల అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే కేసు విచారణను ముమ్మరం చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.
డ్ర*గ్స్ వినియోగం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఖలీద్ రెహమాన్ ‘జింఖానా’, ‘తల్లుమాల’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే, అష్రఫ్ హంజా ‘తమాషా’, ‘భీమంటే వాజి’ వంటి సినిమాలకు దర్శకత్వం అందించారు. నేచురల్ స్టోరీలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు దర్శకులు ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో వారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
పరిశ్రమ వర్గాల్లో ఈ అరెస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇదివరకే, ఈ కేసులో నటుడు షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసిలకు కూడా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. డ్ర*గ్స్ సరఫరాదారులుగా తస్లీమా సుల్తానా అలియాస్ క్రిస్టినా, కె ఫిరోజ్, సుల్తాన్ అక్బర్ అలీ వంటి పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఈ డ్రగ్స్ కేసు తీవ్రమైన నెగటివ్ ఇంపాక్ట్ చూపించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై సినీ ప్రముఖులు స్పందిస్తూ, ఫిల్మ్ ఫీల్డ్‌లో డ్రగ్స్ వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మరింత కఠిన చర్యలు తీసుకోవాలని మదర్స్ అసోసియేషన్ వంటి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇకపోతే, ఇండస్ట్రీలో మరోసారి డ్ర*గ్స్ కలకలం పెద్ద చర్చగా మారింది.
