తరగతి ముఖచిత్రం మార్చిన స్థానర్ధి శ్రీకుట్టన్..!
శ్రీకుట్టన్ అనే కుర్రాడు 7వ తరగతి చదువుతుంటాడు.. ఐతే అతను మిగతా వాళ్లతో గొడవ పడతాడు.. ఇక అతనికి క్లాస్ లో ఒక క్లాస్ మేట్ అంటే ఇష్టం ఉండడు.
By: Tupaki Desk | 11 July 2025 8:28 PM ISTసినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారనే మాటనే అందరు గట్టిగా చెబుతారు కానీ నిజంగా సినిమా చూపించే అంశాలు కొన్ని కథలు చెప్పే జీవిత పాఠాలను క్షుణ్ణంగా పరీశీలిస్తే సినిమా వల్ల జనాలు ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచుకునే స్కోప్ ఉంటుంది. ఐతే అన్ని సినిమాలు ఇలాంటి జ్ఞానాన్ని, మార్పుని అందిస్తాయా అంటే కాదు. కానీ అలాంటి మార్పుని సూచించే సినిమాలు వస్తున్నాయి.. వస్తూనే ఉన్నాయి.
ఆ సినిమా చూసే ఫలానా దొంగతనం జరిగిందని చెబుతాం కానీ ఒక సినిమా వల్ల ఇలాంటి గొప్ప మార్పు జరిగిందని ఎక్కడం చెప్పరు. కానీ ఒక మలయాళం సినిమా వల్ల తరగతి ముఖచిత్రాన్ని మార్చేలా చేశారు. ఆ సినిమానే స్థానర్ధి శ్రీకుట్టన్. మలయాళంలో వినేష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కథ లో బ్యాక్ బెంచర్స్ గురించి ఉంటుంది.
శ్రీకుట్టన్ అనే కుర్రాడు 7వ తరగతి చదువుతుంటాడు.. ఐతే అతను మిగతా వాళ్లతో గొడవ పడతాడు.. ఇక అతనికి క్లాస్ లో ఒక క్లాస్ మేట్ అంటే ఇష్టం ఉండడు.. ఒక టీచర్ ని అందరు తిట్టుకంటాడు.. ఇలా వీరందరితో ఇబ్బంది పడతాడు. ఆ టైంలో స్థానర్ధి శ్రీకుట్టన్ ఏం చేశాడు ఎలా తన సమస్యని సాల్వ్ చేసుకున్నాడు అన్నది సినిమా కథ. లాస్ట్ ఇయర్ నవంబర్ లోనే రిలీజైన ఈ సినిమాకు విశేష స్పందన వచ్చింది. సినిమా వల్ల కేరళలో కొన్ని స్కూల్స్ ఇలా బ్యాక్ బెంచ్ లు తీసేశారు అంటేనే ఆ సినిమా ఎంత గొప్ప విజయాన్ని అందుకుందో అర్ధం చేసుకోవచ్చు.
ముఖ్యంగా స్కూల్ లో బ్యాక్ బెంచర్స్ అనేది లేకుండా యు షేప్ లో బెంచ్ లను ఏర్పాటు చేస్తారు. ఈ డైరెక్టర్ చెప్పిన కథ.. చూపించిన సీన్స్ అన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. స్కూల్ లో అందరు ఈక్వల్ అన్న మెసేజ్ ఇస్తూ ఈ కథ చెప్పాడు డైరెక్టర్. ఐతే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు. కేరళలో కొన్ని స్కూల్స్ లో ఇలా బెంచ్ లు వేయించేలా చేసింది. స్కూల్ పిల్లల మధ్య ఎలాంటి హెచ్చు తగ్గులు ఉండవని చెప్పేలా మంచి మెసేజ్ ఇచ్చిన ఈ సినిమా లాంటి మూవీస్ మరెన్నో రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
