Begin typing your search above and press return to search.

బిగువుల‌తో మాళ‌విక‌ మ‌తి చెడే ట్రీట్

చియాన్ విక్రమ్ `తంగళన్` పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   4 Dec 2023 4:19 AM GMT
బిగువుల‌తో మాళ‌విక‌ మ‌తి చెడే ట్రీట్
X

చియాన్ విక్రమ్ `తంగళన్` పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి పీరియాడికల్ యాక్షన్ డ్రామా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల త‌న‌ పాత్ర కోసం విక్రమ్ నాటకీయ శారీరక పరివర్తన అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది.


మాళ‌విక పూర్తిగా డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో క‌నిపిస్తోంది. చియాన్ తో పోటీప‌డుతూ న‌టిగా త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఇది ఒక ప్ర‌య‌త్నం. అదంతా స‌రే కానీ.. తాజాగా మాళ‌విక షేర్ చేసిన ఓ స్పెష‌ల్ ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. క్రిస్ట‌లైన్ డిజైన‌ర్ టాప్.. దానికి కాంబినేష‌న్ గా నెట్టెడ్ శారీలో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది మాళ‌విక‌. బిగి స‌డ‌ల‌ని అందాల‌ను ఎర వేసి బోయ్స్ ని కిల్ చేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వేవ్స్ క్రియేట్ చేస్తోంది.

మాళ‌విక‌కు అవార్డ్?

చియాన్ విక్ర‌మ్- మాళ‌విక న‌టించిన తంగ‌ళ‌న్ క‌థాంశం ఆస‌క్తిక‌రం. కేజీఎఫ్ బంగారు గ‌నుల్లో సాగే క‌థాంశం ఇది. ఆదిమ‌వాసీలు, వలసరాజ్యాల కాలంలో సెట్ చేసిన క‌థ‌తో తెర‌కెక్కింది. మాళవిక ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లలో ఉన్న‌ప్ప‌టి ఫోటోల‌ను షేర్ చేసింది. త‌న పాత్ర‌ డబ్బింగ్ అని చెబుతూనే తను చాలా భయపడుతోంది. మాళ‌విక‌ డబ్బింగ్ స్టూడియోలోకి ప్రవేశించినప్ప‌టి ఓ అంద‌మైన ఫోటోని కూడా పోస్ట్ చేసింది. దానికి అంద‌మైన‌ క్యాప్షన్ ను కూడా ఇచ్చింది. ``ఇప్పుడు తంగ‌ళ‌న్ నిర్మాణ‌ ప్రక్రియలో చాలా భయంకరమైన భాగం…డబ్బింగ్. దయచేసి నేను చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నా చేయి పట్టుకోగలరా? అని రాసింది మాళ‌విక‌. ఈ చమత్కారమైన హాస్యభరితమైన శీర్షిక అభిమానులను అలరించింది. ఫ్యాన్స్ చాలామంది ఆమెకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

మాళవిక డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎవ‌రి సహాయం లేకుండా అద్భుతంగా చేసింది. స్వయంగా డబ్బింగ్ స్టూడియో నుండి తెరవెనుక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఒక‌ యాక్షన్ సీన్‌కి డబ్బింగ్ చెబుతోంది. మాళవిక మోహనన్ క్లిప్‌లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బదులుగా ఆమె ఊపిరి పీల్చుకుంటూ కేకలు వేస్తూ క‌నిపించింది. తంగ‌ళ‌న్ లో త‌న పాత్ర ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అందుకు సంబంధించిన ఆహార్యం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. చూస్తుంటే చియాన్ తో పాటు మాళవిక‌కు కూడా జాతీయ అవార్డ్ ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.

`తంగలన్‌`లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన ది పియానిస్ట్ పాత్రలకు పేరుగాంచిన ఆంగ్ల నటుడు డేనియల్ కాల్టాగిరోన్ కూడా ఈ చిత్రానికి తన పోర్షన్ డబ్బింగ్ పూర్తి చేశారు. బ్రిటీష్ వలసరాజ్యాల కాలంలో భారతదేశంలో జ‌రిగిన క‌థ‌తో రూపొందిన సినిమా ఇది. బ్రిటీష్ వారు తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన తర్వాత గిరిజన నాయకుడు `తంగలన్` వీరోచిత యుద్ధం కథను తెర‌పై చూపారు. ఈ చిత్రం 26 జనవరి 2024న విడుదల కానుంది.