Begin typing your search above and press return to search.

రూ.500 కోట్ల బడ్జెట్ మూవీకైనా నో చెప్పేస్తుందట

రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తీసే సినిమా అయినా సరే.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే నో చెప్పేస్తానని తేల్చి చెబుతోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:40 AM GMT
రూ.500 కోట్ల బడ్జెట్ మూవీకైనా నో చెప్పేస్తుందట
X

భాష ఏదైనా.. భారతీయ సినిమా లో హీరోకు ఉండే ప్రాధాన్యత హీరోయిన్ కు ఉండదన్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు ఇందుకు భిన్నంగా ఉన్నా.. నూటికి 90 శాతం సినిమాల్లో హీరోయిన్ అంటే.. అంత ప్రాధాన్యత ఇవ్వకుండా హీరో చుట్టూనే మూవీని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుంటే.. ఎంత భారీ సినిమా అయినా సరే తాను నో చెప్పేస్తానంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి అందరూ తన వైపు తిరిగేలా చేస్తోంది మాళవిక మోహన్.

ఈ మలయళీ ముద్దుగుమ్మ వరుస పెట్టి అగ్రహీరోలతో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోడలింగ్ నుంచి సినీ రంగం లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తన తొలి మూవీని దుల్కర్ సల్మాన్ తో జత కట్టి లాంఛ్ అయ్యింది. తమిళ సూపర్ స్టార్ రజనీ 'పేట' మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. విజయ్ తో మాస్టర్ మూవీలోనూ.. ధనుష్ జంటగా మారన్ మూవీలోనూ నటించి.. అందరిని ఇంప్రెస్ చేసింది.

అందానికి అందం.. అభినయం తోడు కావటంతో ఆమెకు పెద్ద పెద్ద ఛాన్సులే వస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఆమె నోటి నుంచి వచ్చిన మాట ఆసక్తికరంగా మారింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తీసే సినిమా అయినా సరే.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే నో చెప్పేస్తానని తేల్చి చెబుతోంది. భారీ బడ్జెట్ మూవీ లో అవకాశం వస్తే చాలు ఎగిరి గంతేసేందుకు హీరోయిన్లు బోలెడంత మంది ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా మాళవిక మోహన్ మాటలు ఆసక్తికరంగా మారాయి.

అయితే.. ఈ విషయంలో ఆమెకు ఒక స్పష్టత ఉంది. తాను సినిమాల్లోకి వచ్చి పదేళ్లు అవుతుందని.. భారీ బడ్జెట్ సినిమా సూపర్ హిట్ అయినా.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేకుంటే.. దాని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. అందుకే.. భారీ బడ్జెట్ మూవీ అయినా తన పాత్ర సరిగా లేకుంటే ఆ సినిమాను తాను ఒప్పుకునేది లేదని స్పష్టం చేస్తోంది.