Begin typing your search above and press return to search.

డెవిల్ మాళవిక.. పవర్ఫుల్ లుక్

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న మూవీ డెవిల్.

By:  Tupaki Desk   |   15 Oct 2023 7:14 AM GMT
డెవిల్ మాళవిక.. పవర్ఫుల్ లుక్
X

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న మూవీ డెవిల్. ఇండియాకి స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ గవర్నమెంట్ తరుపున గూఢచారిగా పనిచేసే సూపర్ స్పై గా కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సంయుక్త హెగ్డే కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే డెవిల్ నుంచి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం మెంచేసింది. పీరియాడిక్ జోనర్ లో మునుపెన్నడూ చూడని సరికొత్త క్యారెక్టరైజేషన్ కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో హీరోయిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

మలయాళీ బ్యూటీ మాళవిక నాయర్ ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్, సామాజిక ఉద్యమకారిణి మణిమేకల పాత్రలో కనిపిస్తోంది. ఆ పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. లుక్ చూస్తుంటే ఆమె పాత్ర సినిమాలో చాలా పవర్ ఫుల్ గానే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

శ్రీకాంత్ విస్సా ఈ మూవీకి స్టొరీ అందించడం విశేషం. ఇప్పటికే హైబడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ లని శ్రీకాంత్ విస్సా స్టార్ హీరోలకి అందిస్తూ వరుస అవకాశాలతో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని నుంచి వస్తోన్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా డెవిల్ ఉండబోతోందని తెలుస్తోంది.

నవంబర్ 22న చాలా సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఇప్పుడు ఈ రేసులోకి డెవిల్ కూడా వచ్చి చేరుతోంది. మరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.