Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాలో హీరోయిన్ హై డోస్ ఫైట్స్!

రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రభాస్ కొన్ని యాక్షన్ సీన్లు చేసి, ఫారిన్ ట్రిప్ కి వెళ్లిపోయారు.

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:11 PM GMT
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ హై డోస్ ఫైట్స్!
X

మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్ రజినీకాంత్ పేట మూవీతో అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత విజయ్ మాస్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో కూడా ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కేసింది.

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డీలక్స్ రాజా, వింటేజ్ కింగ్ అనే పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అధికారిక ప్రకటన అయితే లేదు.

అయితే, ఈ మూవీలోనే ఇద్దరు హీరోయిన్లు కాగా, ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రభాస్ కొన్ని యాక్షన్ సీన్లు చేసి, ఫారిన్ ట్రిప్ కి వెళ్లిపోయారు.

దాదాపు నెల వరకు ఆయన మళ్లీ ఇండియా వచ్చేలా కనపడటం లేదు. దీంతో, ప్రభాస్ లేకుండా సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ కి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో హీరోయిన్ మాళవిక స్టంట్స్ చేస్తుండటం విశేషం. ప్రభాస్ లేరని, షూటింగ్ ఆపేస్తే మూవీ మరింత ఆలస్యమౌతుందని డైరెక్టర్ మారుతి భావించారు. అందుకే, ఆయన లేకున్నా, షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు.

ఇక మాళవిక విలన్స్ తో ఫైటింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ సీన్లు మాత్రమే కాదు, యాక్షన్ సీన్లు కూడా అదరగొడుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, ఈ సినిమా లో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మూవీలో పాత ప్రభాస్ కనపడతాడట. డార్లింగ్, మిర్చిలో లాంటి ప్రబాస్ ని ఇందులో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి నటులు కీలక పాత్ర పోషిస్తుననట్లు సమాచారం. ఇక, ఈ మూవీ ఫుల్ కామెడీ జోనర్ లో సాగుతుందని తెలుస్తోంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.