Begin typing your search above and press return to search.

రాజా సాబ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. చూస్తే ఫిదానే!

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.. స్టార్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jun 2024 11:19 AM GMT
రాజా సాబ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. చూస్తే ఫిదానే!
X

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.. స్టార్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అభినయంతో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇక్కడా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. త్వరలోనే టాలీవుడ్ డెబ్యూ మూవీతో సందడి చేయనుంది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీలో ఆడిపాడుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మాళవిక.. రెగ్యులర్ గా గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంటోంది. తన పరువాలు, థైస్ షోతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఒక్కసారిగా తన పిక్స్ తో హీట్ పెంచింది.


ఓపెన్ బ్యాక్ తో టైట్ వైట్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది మాళవిక. స్పెషల్ డిజైన్ తో ఉన్న డ్రెస్ అదిరిపోయింది. ఇక మాళవిక స్కిన్ షో అయితే వేరే లెవల్. మిర్రర్ లో చూస్తూ రకరకాలుగా పోజులిస్తూ కిర్రెక్కిస్తోంది. బ్యాక్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. నడుము వొంపులతో అందరినీ ఫ్లాట్ అయ్యే స్టిల్స్ ఇచ్చింది. ఓర చూపులతో కుర్రకారును తన బుట్టలో వేసుకుంటోంది. గ్లామర్ షో అంటే ఇలా ఉండాలని చెబుతోంది!


ప్రస్తుతం మాళవిక నయా పిక్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. లాంగ్ డ్రెస్ లో కూడా కనీకనిపంచని అందాలతో అమ్మడు మాయ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె లుక్స్ తోపాటు అందానికి దాసోహమయ్యామని రచ్చరచ్చ చేస్తున్నారు. ఒక్కో పోజు వేరే లెవల్ లో ఉందని అంటున్నారు. మాలీవుడ్ బ్యూటీ.. కిర్రాక్ ఉందని చెబుతున్నారు. మొత్తానికి మాళవిక మోహనన్ పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


సుమారు పదేళ్ల క్రితం మాలీవుడ్ మూవీ పట్టం పోలేతో హీరోయిన్ గా మారింది మాళవిక మోహనన్. రజనీకాంత్‌ పేట మూవీలో యాక్ట్ చేసి అన్ని ఇండస్ట్రీలు కవర్ చేసింది. ఆ తర్వాత విజయ్ తో మాస్టర్, ధనుష్ తో మారన్ చిత్రాలు చేసింది. మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ లో తన లుక్ ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. మరి రాజా సాబ్ తో ఈ బ్యూటీ ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.