Begin typing your search above and press return to search.

విమానంలో మొర‌టుగా ప్ర‌వ‌ర్తించార‌న్న న‌టి

సెలబ్రిటీలకు విమానంలో చేదు అనుభ‌వాల గురించి గ‌తంలో చాలా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అలాంటి ఒక చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్నాన‌ని గుర్తు చేసుకుంది మాళ‌విక మోహ‌న‌న్

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:07 AM GMT
విమానంలో మొర‌టుగా ప్ర‌వ‌ర్తించార‌న్న న‌టి
X

సెలబ్రిటీలకు విమానంలో చేదు అనుభ‌వాల గురించి గ‌తంలో చాలా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అలాంటి ఒక చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్నాన‌ని గుర్తు చేసుకుంది మాళ‌విక మోహ‌న‌న్. మాళవిక మోహనన్‌కి జైపూర్ వెళ్లే విమానంలో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన మాళవిక విమాన సిబ్బంది చెడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసింది. ''చాలా మొరటుగా చెత్త‌ సేవలు @IndiGo6E జైపూర్. సిబ్బంది చెడు ప్రవర్తన'' అని ఎక్స్ ఖాతాలో రాసింది. దీనిపై నెటిజన్లలో డిబేట్ కొన‌సాగింది.

''ఈ కంపెనీకి 50 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటా ఉంది. వారు కస్టమర్ సేవల‌ గురించి పట్టించుకోరు. ఎందుకంటే మనకు తక్కువ ఎంపికలు ఉన్నాయి. ఇది గుత్తాధిపత్యం లేదా ద్వంద్వ పాలనతో సమస్య'' అని ఓ నెటిజన్ బదులిచ్చాడు. మరికొందరు మాళ‌విక హాట్ ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ త‌మ విమాన యాన అనుభ‌వాల‌ను వెల్ల‌డించారు. చాలా మంది మాళ‌విక‌కు మ‌ద్ధ‌తుగా ఎయిర్‌లైన్ సర్వీస్‌ను సరదాగా ఎగతాళి చేస్తున్నారు.

ముంబై బ్యూటీ పూజా హెగ్డే, మ‌ల‌యాళ న‌టి దివ్య స‌హా ప‌లువురు అందాల క‌థానాయిక‌లు గ‌తంలో విమానయాన సిబ్బంది రూడ్ ప్ర‌వ‌ర్త‌న‌పై ఫిర్యాదులు చేసారు. ఐదారు రోజుల క్రితం ఒక ట్రాన్స్ న‌టి కూడా విమాన సిబ్బంది త‌న‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఫిర్యాదు చేయ‌డం హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు హాట్ సౌత్ బ్యూటీ మాళ‌విక కూడా ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది.