65 ఏళ్ల హీరోతో ఆ పనేంటి? హీరోయిన్ ఘాటు రిప్లై
60 ఏళ్లకు పైగా వయసున్న హీరోలకు హీరోయిన్లు ఆ ఏజ్ వారు సెట్ కారు.. కుర్రహీరోయిన్లలోనే కొంచెం సీనియర్ హీరోయిన్ ను పిక్ చేసుకోవాలి.
By: Tupaki Desk | 6 April 2025 10:12 PM IST60 ఏళ్లకు పైగా వయసున్న హీరోలకు హీరోయిన్లు ఆ ఏజ్ వారు సెట్ కారు.. కుర్రహీరోయిన్లలోనే కొంచెం సీనియర్ హీరోయిన్ ను పిక్ చేసుకోవాలి. తప్పదు. అయితే వాళ్ల ఎంపికలోనూ తప్పుపడుతుంటారు కొందరు. అందుకే ఈ మధ్యన స్టార్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వెంటాడుతోందని ఒక గుసగుస వినిపిస్తోంది. చేయడానికి ముందుకొచ్చిన హీరోయిన్లను తిడుతూ ట్రోల్ చేస్తున్న పరిస్థితులు ఇండస్ట్రీలో నెలకొన్నాయి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'హృదయపూర్వం'. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల మాళవిక ఈ సినిమా సెట్‌లోని కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అందులో మోహన్‌లాల్‌తో కలిసి ఆమె నవ్వుతూ ఉన్న ఒక ఫోటో కూడా ఉంది. 'హృదయపూర్వం' సినిమా మొదటి షెడ్యూల్ తాజాగా పూర్తయింది.
షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా మాళవిక తన అనుభవాలను పంచుకుంటూ ఒక పోస్ట్ పెట్టింది. "ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా మొదలు పెట్టినప్పుడు కొత్త స్నేహితులు ఏర్పడతారు లేదా మంచి సహనటులు దొరుకుతారు. కానీ కొన్నిసార్లు మాత్రమే అంతా ఒకే కుటుంబంలా అనిపిస్తుంది. ఈ సినిమా సెట్‌లో నాకు అలాంటి అనుభూతి కలిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను! మోహన్‌లాల్ సర్, సత్యన్ సర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇలాంటి గొప్పవారితో కలిసి పనిచేయడం నా అదృష్టం" అని ఆమె పేర్కొంది.
అయితే, మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలపై ఒక నెటిజన్ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. "65 ఏళ్ల ముసలాయన.. 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణమా? ఈ ముసలి హీరోలు వారి వయసుకు తగిన పాత్రలు కాకుండా ఇలాంటి వాటిపై ఎందుకు ఆసక్తి చూపిస్తారో అర్థం కాదు" అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ కామెంట్‌పై మాళవిక మోహనన్ తీవ్రంగా స్పందించింది. "సినిమాలో అతడు నన్ను ప్రేమిస్తాడని నీకెవరు చెప్పారు? నీకు నువ్వే కథలు అల్లేసుకుని ఏది పడితే అది మాట్లాడకు. నువ్వేదో ఊహించుకుని అవతలి వారిని నిందించకు" అని ఘాటుగా బదులిచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ కామెంట్స్‌ను ఆమె డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
'హృదయపూర్వం' సినిమా విషయానికి వస్తే, దీనికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది 'తంగలాన్', 'యుద్ర' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మాళవిక మోహనన్ ప్రస్తుతం 'ద రాజా సాబ్', 'సర్దార్ 2' వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది.
