చీరందంలో మాళవిక మైమరిపించేలా!
కేరళ కుట్టీ మాళవిక మోహనన్ టాలీవుడ్ ఎంట్రీకి ముందే తెలుగు ఆడియన్స్ ని ఊపేస్తోంది.
By: Tupaki Desk | 15 May 2025 10:48 AM ISTకేరళ కుట్టీ మాళవిక మోహనన్ టాలీవుడ్ ఎంట్రీకి ముందే తెలుగు ఆడియన్స్ ని ఊపేస్తోంది. `రాజాసాబ్` తో టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నా? ఆ సినిమా తో సంబంధం లేకుండా క్రేజీ బ్యూటీగా మారిపోతుంది. ఎప్ప టికప్పుడు కొత్త కొత్త ఘాటు పోజులతో ఇంటర్నెంట్ సంచనలంగా మారడంతోనే ఇది సాధ్యమైంది. మాలీవుడ్..బాలీవుడ్ లో ఎలాగూ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సైతం టాలీవుడ్ కి కలిసొస్తుంది.
రెండు పరిశ్రమల్లో ఇప్పటికే గ్లామర్ గేట్లు తెరిచేసేంది. సందర్భం వచ్చినప్పుడల్లా చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. క్లీవేజ్ అందాలతో...థైషోస్ తో యువతని ఆకర్షిస్తుంది. ఇన్ స్టాలో సంచలనంగా మారు తుంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం చాలా అరుదు. తాజాగా అమ్మడు చీరందంలో తళుకులీన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో అమ్మడు బ్లాక్ అండ్ బ్లాక్ అమ్మడి స్కిన్ టోన్ తళత ళలాడిపోతుంది. చేతిలో మినీ హ్యాండ్ బ్యాగ్ అంతే హైలైట్ అవుతుంది.
నలుపు రంగు చీరపై మ్యాచింగ్ అదే రంగు రవిక ధరించి హోయలు పోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ తో సెల్పీలు దిగుతూ రకరకాల భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. పెదాలకు ఎర్రని లిప్ స్టిక్.. ఐబ్రోస్ మధ్య లో ఎర్రటి స్టికర్.. చెవులకు ధరించిన బులకాలు మాళవిక అందాన్ని రెట్టింపు చేసాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. మాళవిక సోషల్ మీడియా అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఆ సంగతి పక్కనబెడితే మాళవిక రాజాసాబ్ ఎప్పుడు రిలీజ్ అవుదుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కొంత మంది భామలు ఆన్ సెట్స్లో ఉండగానే రెండు..మూడు ఛాన్సులం దుకుంటే? ప్రభాస్ సరసన నటించినా మాళవికకు తెలుగులో కొత్త అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఛాన్సులు బాగానే అందుకుంటుంది.
