Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఔట్‌ ఫిట్‌లో మాళవిక సోయగం

మాళవిక మోహన్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలంకు పైగా అయింది. ఇన్నాళ్లు మలయాళం, కన్నడం, తమిళ్‌, హిందీ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఎట్టకేలకు డైరెక్ట్‌ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 4:00 AM IST
పిక్‌టాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఔట్‌ ఫిట్‌లో మాళవిక సోయగం
X

మాళవిక మోహన్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలంకు పైగా అయింది. ఇన్నాళ్లు మలయాళం, కన్నడం, తమిళ్‌, హిందీ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఎట్టకేలకు డైరెక్ట్‌ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజాసాబ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్‌గా మాళవిక మోహనన్ కనిపించబోతుంది. ఈ అమ్మడు తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు చేయకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది అనడంలో సందేహం లేదు.


తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంది ఈ అమ్మడిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫాలో అవుతూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా నాలుగున్నర మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. మాళవిక ఏ ఫోటోలు షేర్‌ చేసిన చూపరుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మాళవిక మోహన్‌ స్కిన్‌ షో ఫోటోలు షేర్‌ చేస్తే చూపు తిప్పడం కూడా సాధ్యం కాదు అంటూ నెటిజన్లు అంటూ ఉంటారు. ఆ రేంజ్‌లో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ మాళవిక మోహన్‌ తాజాగా తన బ్యాంకాక్‌ ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

మాళవిక మోహన్‌ సాధారణంగానే చాలా అందంగా క్యూట్‌గా ఉంటుంది. అలాంటి మాళవిక మోహన్‌ బ్లాక్ అండ్‌ వైట్‌ ఔట్‌ ఫిట్‌లో కనిపించింది. ఔట్‌ ఫిట్‌ పై జీబ్రాలు ఉన్నాయి. విభిన్నంగా ఉన్న ఈ అమ్మడి ఔట్‌ ఫిట్‌, అందుకు తగ్గట్లుగా ఈమె ఇచ్చిన ఫోజ్‌ ఆకట్టుకుంటుంది. మాళవిక పెద్దగా మేకప్‌ లేకుండానే చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్స్ మేకప్‌ లేకుండా బయటకు రావడం అనేది జరగదు. కానీ మాళవిక మాత్రం రెగ్యులర్‌గా తన నేచురల్‌ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌లో షో కేస్ చేస్తుంది. మేకోవర్‌తో ఉన్న ఫోటోల్లో కంటే మాళవిక ఇలాగే మరింత అందంగా కనిపిస్తుందని అభిమానులు అంటూ ఉంటారు.

ప్రస్తుతం మాళవిక రాజాసాబ్‌ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తుంది. ప్రభాస్‌ సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో మాళవిక కి పాన్ ఇండియా స్టార్‌డం దక్కవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈమె సర్దార్‌ 2 సినిమాలోనూ నటిస్తుంది. కార్తీ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక మోహన్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ రెండు సినిమాలు కాకుండా మాళవిక మరో రెండు మూడు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కావచ్చు.