షార్ట్ స్కర్ట్ లో సెగలు పుట్టిస్తున్న ప్రభాస్ హీరోయిన్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది మాళవిక మోహనన్.
By: Tupaki Desk | 2 May 2026 1:08 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది మాళవిక మోహనన్. మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తొలిసారి తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ప్రభాస్ తో వచ్చిన సన్నివేశాలు మరింత హైలెట్గా నిలిచాయి. బోలెడు ఆశలతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఎదురుచూసిన అమ్మడికి నిరాశ మిగిలింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. కానీ ఇందులో మాళవిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలా మొదటి సినిమాతో తన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకుంది మాళవిక.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా షార్ట్ స్కర్ట్ లో స్టైలిష్ లుక్ తో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది. జీన్స్ టైప్ కోట్ ధరించిన ఈమె బీజ్ షార్ట్ నిక్కర్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుని.. లెదర్ తో డిజైన్ చేసిన హ్యాండ్ బ్యాగ్ ను చేతిలో పట్టుకొని స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది మాళవిక. చాలా రోజుల తర్వాత ఇలా బిల్డింగ్ పైకి ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అభిమానులు కూడా వీటికి ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ అమ్మడిపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
మాళవిక ఎవరో కాదు మలయాళ స్టార్ సినిమాటోగ్రాఫర్ కే. యూ. మోహనన్ కుమార్తె. 1993 ఆగస్టు 4న జన్మించిన ఈమె మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించింది. ఇక 2013లో వచ్చిన మలయాళ సినిమా పట్టం పోల్ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మాళవిక తమిళ్ , హిందీ భాషలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది . ఈ ఏడాది ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాళవిక చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020 జాబితాలో ఐదవ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
చివరిగా మలయాళంలో హృదయపూర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాళవిక.. ఇప్పుడు సర్దార్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే త్యాగరాజన్ కుమార రాజా తో కలిసి పాకెట్ నవల లో నటిస్తున్న ఈమె మరికొన్ని ప్రాజెక్టులలో భాగమైనట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు హీరోయిన్లు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయారు. మరి ఒకవేళ ఈ సినిమాలు గనుక మంచి విజయాన్ని అందుకుంటే మాళవిక స్టార్ హీరోయిన్గా ఎదుగుతుంది అనడంలో సందేహం లేదు.
