Begin typing your search above and press return to search.

ఎడారిలో ప్రభాస్ హీరోయిన్ వెతుకులాట దేనికోసం?

అయితే మాళ‌విక సినిమాల‌తోనో, ఫోటో షూట్‌ల ద్వారానో లేదా మ‌రేదైనా విష‌యం వ‌ల్ల‌నో ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు.

By:  Tupaki Desk   |   25 July 2025 6:00 PM IST
ఎడారిలో ప్రభాస్ హీరోయిన్ వెతుకులాట దేనికోసం?
X

ప‌ట్టం పోలె అనే సినిమాతో న‌టిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాళ‌విక మోహ‌నన్ ఆ త‌ర్వాత క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయారు. తెలుగులో మాళవిక ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా చేయ‌క‌పోయినా ఆమె న‌టించిన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవ‌డం ద్వారా అమ్మ‌డు టాలీవుడ్ ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌స్తురాలే. అయితే మాళ‌విక సినిమాల‌తోనో, ఫోటో షూట్‌ల ద్వారానో లేదా మ‌రేదైనా విష‌యం వ‌ల్ల‌నో ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు.


ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్న మాళ‌విక మోహ‌న‌న్ రీసెంట్ గా త‌న రాజ‌స్థాన్ టూర్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్ర‌మ్ స్టోరీల్లో పోస్ట్ చేశారు. అందులో మాళ‌విక చాలా రెగ్యుల‌ర్ గా డ్రెస్స‌ప్ అయి క‌నిపించారు. ఈ ఫోటోల్లో మాళ‌విక మ‌రింత ఎట్రాక్టివ్ గా క‌నిపించ‌గా, ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోల‌ను, ఆమె వైబ్ ను ఇష్ట‌ప‌డుతున్నారు.


ఈ ఫోటోల్లో ఎలాంటి గ్లామ‌ర్ యాంగిల్ లేదు. ఫిల్ట‌ర్లు కానీ, గ్లామ‌ర్ ఎట్రాక్ష‌న్స్ కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్ గా రాజ‌స్థాన్ లో జీప్ లో ట్రావెల్ చేస్తూ మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌తీ ఫ్రేమ్ చాలా కొత్త‌గా క‌నిపిస్తోంది. రెగ్యుల‌ర్ ఫోటోషూట్‌లా కాకుండా మాళ‌విక ప్ర‌తీ షాట్ లోనూ ఓ కొత్త‌ద‌నాన్ని చూపించ‌డంతో ఆ ఫోటోలు మ‌రింత స్పెష‌ల్ గా మారాయి.


ఇక సినిమాల విష‌యానికొస్తే మాళ‌విక ప్ర‌స్తుతం ఇద్ద‌రు టాప్ స్టార్ల‌తో న‌టిస్తున్నారు. టాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో రాజా సాబ్ సినిమాను చేస్తున్న మాళ‌విక‌, మ‌ల‌యాళంలో హృద‌య‌పూర్వంలో మోహ‌న్ లాల్ తో క‌లిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారు. ఈ రెండు సినిమాల నుంచి టీజ‌ర్లు రాగా, వాటిలో మాళ‌విక క్యారెక్ట‌ర్, స్క్రీన్ ప్రెజెన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.