Begin typing your search above and press return to search.

మాళ‌విక ద‌ర్శ‌కురాలు అవ్వాల‌నుకుందా!

కేర‌ళ కుట్టి మాళ‌విక మోహ‌న‌న్ టాలీవుడ్ లో ఇంకా లాంచ్ అవ్వ‌డానికంటే ముందే ఫేమ‌స్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jun 2025 12:30 PM
మాళ‌విక ద‌ర్శ‌కురాలు అవ్వాల‌నుకుందా!
X

కేర‌ళ కుట్టి మాళ‌విక మోహ‌న‌న్ టాలీవుడ్ లో ఇంకా లాంచ్ అవ్వ‌డానికంటే ముందే ఫేమ‌స్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `రాజాసాబ్` లో అమ్మ‌డు మాంచి ఐటం పాట‌తో అల‌రించ‌డానికి రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కుముందే మాళ‌విక టాలీవుడ్ ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌రైంది. రిలీజ్ అయిన త‌ర్వాత అమ్మ‌డి ఫాలోయింగ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం.

ఇప్ప‌టికే అమ్మ‌డు నెట్టింట ఓ సంచ‌ల‌నం. హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారులో గుబులు పుట్టిస్తుంది. మ‌తిపోయే భంగిమ‌ల‌తో సెగ‌లు రేపుతుంది. కేర‌ళ అందాలు ఎలివేషన్ విష‌యంలో మిగ‌తా భామ‌లు వెనుకా? ముందు ఆలోచిస్తారేమో గానీ మాళ‌విక మాత్రం అలాంటి ఆలోచ‌న‌లేవి ద‌రి చేర‌నీయ‌కుండా చేల‌రే గుతుంది. అందుకే కేర‌ళ భామ‌లందు ఈ భామ సంథింగ్ స్పెష‌ల్. అయితే ఈ బ్యూటీ న‌టి అవ్వ‌డం అన్న‌ది అనుకోకుండా జ‌రిగింద‌ని తెలిపింది.

కెమెరా ముందుకు రావ‌డం కంటే కెమెరా వెనుక ఉండే ప‌నిచేయ‌డం త‌న‌కి ఎక్కువ ఆస‌క్తి అని అంటోంది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే తాను ద‌ర్శ‌కురాలినో, ఛాయాగ్రాహ‌కురాలో అయ్యేదాన్ని అని , కానీ కాలం త‌న‌ని న‌టిగా ప‌రిచ‌యం చేసిందంది. ఓద‌శ‌లో ఎడిటింగ్ కూడా నేర్చుకుందిట‌. ఆ విభాగంలో స్థిర‌ప డాల‌నే ఆలోచ‌న కూడా ఉండేద‌ని తెలిపింది.

మాళ‌విక తండ్రి కె.యూ మోహ‌న‌న్ ప్ర‌ముఖా చాయాగ్రాహ‌కుడు. మాలీవుడ్ లో ఎన్నో సినిమాల‌కు ప‌ని చేసారు. సీనియ‌ర్ టెక్న‌షియ‌న్ గా ఆయ‌న‌కు మంచి పేరుంది. ఈ నేప‌థ్యంలో త‌న‌య కూడా తండ్రి అడుగుజాడ‌ల్లోనే కెమెరా ఉమెన్ అవ్వాల‌నుకుంది. కానీ న‌టిగా అందాలతో అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం త‌మిళ్, మ‌ల‌యాళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది.