పిక్‌టాక్ : మాళవిక ఇలా కూడా భలే ఉందే
టాలీవుడ్‌లో రాజాసాబ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.
By: Tupaki Desk | 3 July 2025 3:44 PM ISTటాలీవుడ్‌లో రాజాసాబ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అవుతుంది. పలు సార్లు తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయట. కానీ పెద్ద సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు వెయిట్ చేసింది. ఇన్నాళ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కింది. బాలీవుడ్‌లోనూ పాపులారిటీ సొంతం చేసుకునే విధంగా రాజాసాబ్ సినిమాలో కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన రాజాసాబ్ టీజర్‌లో మాళవిక మోహన్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాస్త హ్యూమర్ ఉన్న పాత్రగా తెలుస్తోంది. తప్పకుండా మాళవిక టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
సినిమాలతో పాటు అందాల ఆరబోత ఫోటో షూట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో 43 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మాళవిక మోహన్ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా స్కిన్ షో ఫోటోలు షేర్ చేయడంతో చాలా మంది ఈమెను అలాగే ఇష్టపడుతూ ఉంటారు. మాళవిక స్కిన్ షో చేస్తేనే బాగుంటుంది అంటూ చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా ఈమె లిఫ్ట్‌లో దిగిన సెల్ఫీని షేర్ చేసింది. స్కిన్ షో చేస్తేనే కాకుండా ఇలా సింప్లీ సూపర్ లుక్‌తోనూ మాళవిక మోహనన్ ఆకట్టుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది.
లిఫ్ట్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసిన మాళవిక మోహనన్ హలో హైదరాబాద్, ఈసారి మనం కలిసేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు అన్నట్లుగా పోస్ట్ చేసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమా చివరి దశ షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్‌కి వచ్చింది. తన షూటింగ్‌ను ముగించుకున్న మాళవిక రిటర్న్ అవుతున్న సమయంలో ఈసారి హైదరాబాద్ రావడంకు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు అన్నట్లుగా కామెంట్ చేసింది. ఎందుకంటే రాజాసాబ్ సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్ కోసం మాళవిక మోహనన్ తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఆలస్యం అవుతుందని ముందే చెప్పింది.
మాళవిక మోహనన్ ఏ ఫోటోలు షేర్ చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. స్కిన్ షో చేయకున్నా కూడా ఇలా సింప్లీ సూపర్‌గా ఉందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైట్ కలర్ టాప్‌ను, బ్లేజర్‌ను ధరించిన మాళవిక మోహనన్ పింక్ కలర్ పాయింట్‌ను ధరించింది. సింప్లీ సూపర్ లుక్‌లో మాళవిక మోహనన్ ఆకట్టుకుంది. సాధారణంగా హీరోయిన్స్ ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తే జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ మాళవిక మోహనన్ మాత్రం ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ, ఇలాంటి ఫోటోలతోనూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అందుకే మాళవిక మోహనన్ ఇలా కూడా భలే ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
