పిక్‌టాక్ : అందంగా కనిపించడం ఇంత కష్టం!
మాళవిక మోహనన్ ఈ ఫోటోను షేర్ చేసి.. ప్రిటీగా కనిపించడం కోసం జరిగే ప్రోసెస్ నిజంగా ప్రిటీగా ఉండదు అంటూ దెయ్యం ఈమోజీని షేర్ చేసింది.
By: Tupaki Desk | 4 May 2025 2:00 AM ISTమలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు పదేళ్లు అవుతుంది. మలయాళం, తమిళ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు రెడీ అయింది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాతో ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతున్న ఆ సినిమాతో పాటు మరో సినిమాను సైతం ఈమె కమిట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే సినిమా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ మలయాళి ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తన అందంను కాపాడుకోవడం కోసం, తన ఫిజిక్‌ను ఎప్పుడూ స్లిమ్‌గా ఉంచుకోవడం కోసం మాళవిక మోహనన్ చాలా కష్టపడుతోంది. జిమ్‌లో ఎక్కువ సమయం వర్కౌట్లు చేసే ఈ అమ్మడు తన ఫేస్ అందంగా కనిపించడం కోసం ప్రతి రోజు ప్రత్యేకమైన మేకోవర్‌తో పాటు, స్కిన్ ప్రొటక్షన్స్ వాడుతూనే ఉంటుంది. తాజాగా ఈ ఫోటోను షేర్ చేసి తాను అందంగా కనిపించడం కోసం పడే కష్టాలను వివరించే ప్రయత్నం చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మాళవిక మోహనన్ ఈ ఫోటోను షేర్ చేసి.. ప్రిటీగా కనిపించడం కోసం జరిగే ప్రోసెస్ నిజంగా ప్రిటీగా ఉండదు అంటూ దెయ్యం ఈమోజీని షేర్ చేసింది. ఫేస్ పై మాస్క్ ధరించి గుర్తు పట్టలేనంత విభిన్నంగా ఉన్న మాళవిక మోహనన్ లుక్‌కి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు. నిజంగానే హీరోయిన్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందంగా కనిపించడం కోసం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేసే మాళవిక మోహనన్ ఈసారి తన అందం వెనుక దాగి ఉన్న కష్టం ను చూపించింది. ఈ ఫోటోతోనూ మాళవిక మోహనన్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల జాబితా విషయానికి వస్తే... తమిళ్‌లో సర్దార్ 2 సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో వచ్చిన సర్దార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కార్తీ, మిత్రన్‌లు సీక్వెల్‌కి సిద్ధం అయ్యారు. మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్ మరింత బాగుంటుంది అంటూ మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మోస్ట్ క్రేజీ సీక్వెల్ ప్రాజెక్ట్‌లో ఈ అమ్మడు నటిస్తున్న నేపథ్యంలో తమిళ్‌లో మరో హిట్ పడే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో రాజాసాబ్ సినిమా తర్వాత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీ సినిమాల వైపు కూడా ఈ అమ్మడు చూస్తోంది. కొన్ని హిందీ సినిమాలోనూ ఈమె నటించింది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం బ్రేక్ దక్కలేదు.
