Begin typing your search above and press return to search.

వీడియో : మాళవిక నైట్‌ పార్టీ వైరల్‌

తాజాగా తన స్టోరీ లో లాస్ట్‌ నైట్‌ పార్టీ వీడియోను షేర్‌ చేసింది. అమ్మాయిలు గత రాత్రి టూ హార్డ్‌ అంటూ వీడియోపై కామెంట్‌ పెట్టింది.

By:  Tupaki Desk   |   22 May 2025 4:19 PM IST
వీడియో : మాళవిక నైట్‌ పార్టీ వైరల్‌
X

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న మాళవిక మోహనన్‌ ఎట్టకేలకు టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతుంది. ఇప్పటి వరకు పలు డబ్బింగ్‌ సినిమాలతో మెప్పించిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌ మొదటి సారి డైరెక్ట్‌ సినిమాతో ప్రభాస్‌తో కలిసి రాబోతున్న విషయం తెల్సిందే. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాలో ఒక హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలవడం ఖాయం అనే నమ్మకంను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో ఒక్క సినిమా చేయకుండానే ఎంతో మంది అభిమానులను ఈ అమ్మడు సొంతం చేసుకుంది.

ఈమెను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది తెలుగు వారు ఫాలో అవుతూ ఉంటారు. నాలుగున్నర మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా తన స్టోరీ లో లాస్ట్‌ నైట్‌ పార్టీ వీడియోను షేర్‌ చేసింది. అమ్మాయిలు గత రాత్రి టూ హార్డ్‌ అంటూ వీడియోపై కామెంట్‌ పెట్టింది. వీడియోలో స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న మాళవికను చూడవచ్చు. బ్లాక్‌ టాప్‌ ధరించిన మాళవిక లుంగీ వంటి బోటమ్ ఔట్‌ ఫిట్‌ను ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. విభిన్నమైన మాళవిక లుక్‌కి అక్కడి వారు అంతా ఫిదా అయ్యి ఉంటారు అనడంలో సందేహం లేదు.

మొత్తానికి పార్టీ వీడియోను స్టోరీగా పెట్టడంతో వైరల్‌ అయింది. స్టోరీ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. మాళవిక మోహన్‌ రాజాసాబ్‌ సినిమాతో పాటు ప్రస్తుతం తమిళ్‌లో సర్దార్‌ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజాసాబ్‌ తో సమానంగా ఆ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. త్వరలోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్‌కి జోడీగా ఈమెను చూడాలని అభిమానులు గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ ఏడాది చివరి వరకు అయినా రాజాసాబ్‌ సినిమా వస్తుందేమో చూడాలి. సర్దార్‌ 2 సినిమా సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు, తమిళ్‌ సినిమాలు మాత్రమే కాకుండా ఒక మలయాళ సినిమాలోనూ ఈమె నటిస్తోంది. మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో మాళవిక మోహన్‌ కీలక పాత్రలో కనిపించబోతుంది. సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం దక్కడంతో మాళవిక ఆనందం అంతా ఇంతా కాదు. రెగ్యులర్‌గా మోహన్‌ లాల్‌ మూవీ హృదయపూర్వం పోస్టర్‌లను షేర్‌ చేస్తూ సినిమాను కావాల్సినంత పబ్లిసిటీ చేస్తోంది. ఇక రాజాసాబ్‌ సినిమాలో మాత్రం ఇప్పటి వరకు ఈమె లుక్‌ను రివీల్‌ చేయలేదు. పాత్రను కూడా మేకర్స్ ఇప్పటి వరకు రివీల్‌ చేయక పోవడంతో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.