Begin typing your search above and press return to search.

సంక్రాంతితో అయినా త‌న ఫేట్ మారేనా?

కొంత మంది ఇప్ప‌టికీ గుర్తింపు కోసం స్ట్ర‌గుల్ అవుతూనే ఉన్నారు. అలాంటి ప‌రిస్థిత‌నే గ‌త కొన్నేళ్లుగా ఎదుర్కొంటోంది మ‌ల‌యాళీ సోయ‌గం మాళ‌వికా మోహ‌న‌న్‌. తండ్రి ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్‌.. కె.యు. మోహ‌న‌న్‌.

By:  Tupaki Desk   |   27 Dec 2025 12:00 AM IST
సంక్రాంతితో అయినా త‌న ఫేట్ మారేనా?
X

తండ్రి ఫేమ‌స్ ప‌ర్స‌న్ అయినా స‌రే ఇక్క‌డ టాలెంట్‌, అదృష్టం కూడా ఉంటేనే వ‌ర్కువుట్ అవుతుంద‌ని, టైమ్‌, అదృష్టం క‌లిసి రాక‌పోతే ఎంత ఫేమ‌స్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా ఇక్క‌డ పేరు తెచ్చుకోవ‌డం అంత సుల‌భం కాద‌ని ఎంతోమంది న‌ట‌వార‌సులు నిరూపించారు. కొంత మంది ఇప్ప‌టికీ గుర్తింపు కోసం స్ట్ర‌గుల్ అవుతూనే ఉన్నారు. అలాంటి ప‌రిస్థిత‌నే గ‌త కొన్నేళ్లుగా ఎదుర్కొంటోంది మ‌ల‌యాళీ సోయ‌గం మాళ‌వికా మోహ‌న‌న్‌. తండ్రి ఫేమ‌స్ సినిమాటోగ్రాఫ‌ర్‌.. కె.యు. మోహ‌న‌న్‌.

బాలీవుడ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్‌లుగా నిలిచిన `హ‌మ్ దిల్ దేచుకే స‌న‌మ్‌, ల‌గాన్‌, డాన్‌, అజా నాచ్‌లే, వీ ఆర్ ఫ్యామిలీ, ర‌యీస్‌, అంధాధున్‌.. తెలుగు క్రేజీ మూవీస్ మ‌హ‌ర్షి`, ది ఫ్యామిలీ స్టార్‌, మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ఫిల్మ్ `ఆడుజీవితం` వంటి సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. మ‌ల్లూవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు పాపుల‌ర్ ఆయ‌న‌. ఆయ‌న వార‌సురాలిగా సినిమాల్లోకి ప్ర‌వేశించింది మాళ‌వికా మోహ‌న‌న్‌. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టితో క‌లిసి తొలి క‌మ‌ర్షియ‌ల్ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ లో న‌టించింది.

ఆ త‌రువాత ఆయ‌న త‌న‌యుడు, టాలెంటెడ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన `ప‌ట్టంపోలె`తో హీరోయిన్‌గా మ‌ళ‌యాలంలో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ మూవీ `బియాండ్ ద క్లౌడ్స్‌`తో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `పేట్ట‌`లో న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. అయినా త‌నది అందులో ప్రాధాన్యం ఉన్న క్యారెక్ట‌ర్ కాక‌పోవ‌డం, `పేట్ట‌` ఫ్లాప్ కావ‌డంతో మాళ‌విక మోహ‌న‌న్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఆ సినిమా త‌న కెరీర్‌ని ఓ ద‌శ‌లో తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింద‌ట‌.

ఈ మూవీ త‌రువాత కూడా త‌న‌కు ఇలాంటి క్యారెక్ట‌ర్లే రావ‌డంతో కొంత మంది నిర్మాత‌లు ఇక‌పై నున్న సెకండ్ హీరోయిన్‌గా సెట్ట‌వ్వాల్సిందేన‌ని ఎగ‌తాలి చేశార‌ట‌. అలాంటి స‌మ‌యంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ `మాస్ట‌ర్‌` మ‌ళ్లీ మాళ‌విక‌ని లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది. విక్ర‌మ్ `తంగ‌లాన్‌`, మోహ‌న్‌లాల్ `హృద‌య‌పూర్వం` సినిమాలు మాళ‌వికకు మంచి క్రేజ్‌ని తెచ్చి పెట్టి ఆమె కెరీర్‌ని గాడిలో ప‌డేశాయి. ఇప్ప‌డు త‌న ఆశ‌ల‌న్నీ `ది రాజాసాబ్‌`పైనే పెట్టుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన కామెడీ థ్రిల్ల‌ర్ ఇది.

ఇందులో మాళ‌విక మోహ‌న‌న్ ప్ర‌ధాన హీరోయిన్‌గా క‌నిపించి ఆక‌ట్టుకోబోతోంది. జ‌న‌వ‌రి 9న సంక్రాంతి బ‌రిలో దిగుతున్న ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే త‌న కెరీర్ మ‌లుపు తిరిగిన‌ట్టేన‌ని మాళ‌విక భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఉంది. `బాహుబ‌లి` చూసిన త‌రువాత ఎప్ప‌టికైనా ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించాల‌ని, ఆ అవ‌కాశం కోసం ఎదురు చూసి ఫైన‌ల్‌గా ఆ ఛాన్స్‌ని ప‌ట్టేసి స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరాల‌ని భావిస్తోంది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే మాళ‌విక ద‌శ తిరిగిన‌ట్టేన‌ని టాలీవుడ్, మ‌ల్లూవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ మూవీ త‌రువాత మ‌రో క్రేజీ మూవీ `స‌ర్దార్ 2`తోనూ అల‌రించ‌డానికి రెడీ అవుతోంది. కార్తి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ `స‌ర్దార్‌`కు సీక్వెల్‌గా భారీ స్పాన్ ఉన్న క‌థ‌తో రూపొందుతున్న `స‌ర్దార్ 2` కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిస్తే మాళ‌విక కెరీర్ ఊపందుకోవ‌డం ఖాయం.