Begin typing your search above and press return to search.

ర‌వీనా కూతురితో మ‌లైకా కొడుకు డేటింగ్?

అయితే దీనికి కార‌ణం ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒకే కార్ లో ఔటింగుకు వెళ్ల‌డ‌మే.

By:  Tupaki Desk   |   26 Jan 2024 3:24 PM GMT
ర‌వీనా కూతురితో మ‌లైకా కొడుకు డేటింగ్?
X

ఒక‌ప్ప‌టి అందాల క‌థానాయిక ర‌వీనాటాండ‌న్ కుమార్తె, మ‌లైకా అరోరా ఖాన్ కుమారుడు అర్హాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తోందంటూ ఒక పుకార్ మొద‌లైంది. అయితే దీనికి కార‌ణం ఆ ఇద్ద‌రూ క‌లిసి ఒకే కార్ లో ఔటింగుకు వెళ్ల‌డ‌మే.

బాలీవుడ్ లో చాలా కాలం పాటు దీప్‌వీర్ .. విక్‌క్యాట్ జంట‌లు అంద‌రి దృష్టిని ఆకర్షించాయి. ఇటీవల, పాలక్ తివారీ - ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ - వేదంగ్ రైనా, సుహానా ఖాన్ - అగస్త్య నందా వంటి న‌వ‌త‌రం జంటల గురించి ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది. కానీ ఇప్పుడు మలైకా అరోరా -అర్బాజ్ ఖాన్ జంట‌ కుమారుడు అర్హాన్ తో ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా థడానీ జంట‌గా క‌నిపించింది. రాషా తడాని.. రవీనా టాండన్ - అనిల్ తడానీల పెద్ద బిడ్డ. ఈ యంగ్ బ్యూటీ ఈ రోజు బాంద్రాలో అర్హాన్‌తో కలిసి కనిపించింది. ఆ స‌మ‌యంలో ఇద్దరినీ ముంబై మీడియా అస్స‌లు విడిచిపెట్ట‌కుండా వెంటాడింది. నెటిజన్లు వీరిద్దరినీ చూశాక చాలా క్యూట్ అంటూ ప్ర‌శంసించారు. రాషా థడాని నిజానికి దేవ‌తా సుంద‌రి రవీనా టాండన్ కి కార్బన్ కాపీ. దీంతో కుర్ర‌కారు క‌ళ్లు తిప్పుకోవ‌డం అంత సులువేమీ కాదు. ఊరించే న‌వయ‌వ్వ‌న సిరి ఈ అమ్మ‌డు.

అర్హాన్ ఖాన్ - రాషా తడాని ఓ రెండుసార్లు ఇలా క‌లిసి షికార్ వెళుతూ కనిపించారు. రవీనా టాండన్ తో క‌లిసి అర్బాజ్ ఖాన్ - షురా ఖాన్‌ల సన్నిహిత వివాహాలకు కూడా జంట‌గా హాజరయ్యారు. వీరిద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అర్హాన్ ఖాన్ తన తండ్రి రెండవ పెళ్లిలో గిటార్ వాయించిన వీడియో వైరల్ కావడంతో వార్తల్లో నిలిచాడు. అర్హాన్ ఖాన్ తన తల్లి మలైకా అరోరా సూచ‌న మేర‌కు UK లో చదువుతున్నాడు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాసైన రాషా తడానీ త్వరలో సినీరంగ ప్రవేశం చేయబోతోంది. ఇక రాషా త‌డానీ, అర్హాన్ ల‌ను చూస్తుంటే ఆ ఇద్ద‌రూ స్కూల్ ఫ్రెండ్స్ అని అర్థ‌మ‌వుతోంది. ఈ జంట‌పై డేటింగ్ ప్ర‌చారం కేవ‌లం పుకార్ గానే ప‌రిగ‌ణించాలి.

అర్హాన్ ఖాన్ పై గతంలో చానెల్ రాబిన్సన్‌తో లింక్ అప్ చేసి ప్ర‌చారం సాగించారు. ఆమె వాలుస్చా డిసౌజా -మోడల్ మార్క్ రాబిన్సన్ దంప‌తుల‌ కుమార్తె. అతడు తన మామ్ ఇంటికి క్రిస్మస్ పార్టీకి తీసుకురావడంతో ఆ ఇద్ద‌రి గురించి గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. రవీనా టాండన్ - వాలుషా ఇద్దరూ సల్మాన్ ఖాన్ కుటుంబానికి చాలా సన్నిహితులు.

అర్హాన్ ఖాన్ సినిమాల్లోకి వస్తాడా?

అభిషేక్ కపూర్ సినిమాతో రాషా థడానీ తెరంగేట్రం చేస్తుంది. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ కూడా ఇందులో భాగమయ్యాడు. డయానా పెంటీ, అజయ్ దేవగన్ కూడా అడ్వెంచర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇక అర్హాన్ ఖాన్ ప్ర‌స్తుతం చ‌దువుల‌పై దృష్టి సారించాడు. ఆ త‌ర్వాత అత‌డు న‌ట‌న‌లోకి వ‌స్తాడా లేదా? అన్న‌ది వేచి చూడాలి.