Begin typing your search above and press return to search.

మ‌లైకా బ‌ర్త్ డే ట్రీట్..క‌పూర్ బోయ్ దాసోహం!

అక్టోబ‌ర్ 23న‌ మలైకా ఆరోరా బ‌ర్త్ డే సంర‌ద్భంగా ఇద్ద‌రు స‌న్నిహితంగా ఉన్న ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది .

By:  Tupaki Desk   |   24 Oct 2023 6:03 AM GMT
మ‌లైకా బ‌ర్త్ డే  ట్రీట్..క‌పూర్ బోయ్ దాసోహం!
X

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే. కొంత కాలంగా ఇద్ద‌రు ప్రేమ పాఠాల్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లొచ్చాయి.. విడిపోతున్నారు.. విడిపోయారు అంటూ చాలాసార్లు మీడియా క‌థ‌నాలు వెడెక్కించిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు కొన్ని ర‌కాల హింట్స్ తో అలాంటిదేం? లెద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. తాజాగా ప్రియురాలి బ‌ర్త్ డే రోజున ఇద్ద‌రు ఎంత అన్యోన్యంగా ఉన్నారో మ‌రో పిక్ తో తేట తేల్ల‌మ‌వుతోంది.


అక్టోబ‌ర్ 23న‌ మలైకా ఆరోరా బ‌ర్త్ డే సంర‌ద్భంగా ఇద్ద‌రు స‌న్నిహితంగా ఉన్న ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది .ఇదిగో ఇక్క‌డిలా న‌డి రాతిరి స‌మ‌యంలో ఇలా పార్టీలో చిల్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. పార్టీ మ‌ధ్య‌లో ఇద్ద‌రు లేచి క‌లిసి జంట‌గా డాన్స్ చేసిన‌ట్లు తెలుస్తుంది. మ‌లైకా కౌగిలిలో క‌పూర్ బోయ్ మంత్ర ముగ్దుడ‌య్యాడు. వైట్ కాంబినేష‌న్ లెహంగా దుస్తుల్లో మ‌లైకా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

అమ్మ‌డు చేతి వేలికి ఇష్ట‌మైన గ్రీన్ కాంబినేష‌న్ రింగ్స్ ధ‌రించింది. అదే డిజైన్ తో కూడిన పొడి డ్రెస్ పైనే ఉంది. ఇక అర్జున్ క‌పూర్ బ్లాక్ అండ్ బ్లాక్ లో మ‌నోహ‌రంగా క‌నిపిస్తున్నాడు. క‌పూర్ బోయ్ త‌న‌దైన స్టైల్లో ప్రియురాలితో కాలు క‌దిపాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఈఫోటోతో మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి పోర‌పొచ్చాలు లేవ‌ని..క‌లిసే ఉన్నార‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక అభిమానుల కామెంట్లు ష‌రా మామూలే. పాజిటివ్..నెగిటివ్ రెండు ర‌కాల కామెంట్లు కుప్ప‌లుగా పోగ‌వు తున్నాయి. కెరీర్ ప‌రంగా ఇద్ద‌రు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌లైకా ముదురు భామ అయినా అవ‌కాశాలు అందుకుంటూనే ఉంది. ఏదో షోతో బిజీగానే గ‌డుపుతుంది. క‌పూర్ బోయ్ హిందీతో పాటు ఇత‌ర భాష‌ల‌పైనా దృష్టి పెట్టాడు.