Begin typing your search above and press return to search.

ఫెమీనాపై మ‌లైకా కిర్రెక్కించే అందాలు!

వాళ్ల‌ద్ద‌రిలో పాజిటివ్ యాంగిల్ అయిన‌ అజ‌రామ‌ర ప్రేమ కోణం క‌న్నా..నెగిటివ్ యాంగిల్ నే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 6:07 AM GMT
ఫెమీనాపై మ‌లైకా కిర్రెక్కించే అందాలు!
X

బాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా అరోరా టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 50 ఏళ్ల‌కు చేరుకువ‌లో ఉన్నా వ‌య‌సు దాచేసి మ‌రీ త‌న‌లో హాట్ యాంగిల్ ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆవిష్క‌రిస్తూనే ఉంటుంది. కుర్ర‌భామ‌ల‌కి ఏమాత్రం తీసిపోనంటూ గ్లామ‌ర్ రేసులో నిలిచే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. క‌వ‌ర్ పేజీల‌పై సొగ‌సైన భంగిమ‌ల‌తో ఆక‌ర్షించ‌డం అమ్మ‌డి ప్రత్యేక‌త‌. ఓ ర‌కంగా మలైకాలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు ప్ర‌శంసించ‌ద‌గ్గ‌వే.


వ‌య‌సు మీద ప‌డిపోయింద‌ని దిగాలు ప‌డ‌కుండా పోటీలో నిల‌వాల‌ని త‌న ఉన్న క‌సి ప‌ట్టుద‌ల్ని క‌చ్చితం గా మెచ్చుకోవాల్సిందే. అవ‌కాశాలు వ‌చ్చినా..రాక‌పోయినా ఎదుట వారిపై నింద‌లు వేయ‌కుండా మ‌లైకా త‌న ప‌ని తానేదో చూసుకుంటుంది. ఆ ర‌కంగా మ‌లైక విష‌యంలో బాలీవుడ్ తొలి నుంచి పాజిటివ్ గానే ఉంటుంది. తాజాగా మ‌లైకా ఆరోరా ఫెమీనా క‌వ‌ర్ పేజీ కోసం ఇచ్చిన భంగిమ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

సాగ‌ర‌క‌న్య దుస్తుల్లో అమ్మ‌డు సెగులు పుట్టిస్తుంది. మ‌లైకా మ్యాక‌ప్..టోన్డ్ బాడీ లుక్ ఆక‌ర్షిస్తుంది. ప‌ర్పెక్ట్ క్లీవేజ్ ఎలివేష‌న్ తో నయా భామ‌ల‌కి నేనేం త‌క్కువ అనిపించేలా అందాల విందు చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. వెర్రెత్తించే మ‌లైకా అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉన్నా వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ లా ముందుకు సాగిపోతున్నారు. మ‌రి ఈ ప్ర‌యాణం ఎంత దూరం వెళ్తుంది అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే ఈ జోడీని ఉద్దేశించి నెట్టింట జ‌రిగిన చ‌ర్చ అంతా ఇంతా కాదు. వాళ్ల‌ద్ద‌రిలో పాజిటివ్ యాంగిల్ అయిన‌ అజ‌రామ‌ర ప్రేమ కోణం క‌న్నా..నెగిటివ్ యాంగిల్ నే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు.