Begin typing your search above and press return to search.

స‌మ‌స్య చిన్న‌దే..అందుకే మ‌లైకా-అర్జున్ మ‌ళ్లీ క‌లిసారా?

అయితే తాజాగా ఒక్క ఫోటోతో ఈ జంట బ్రేక‌ప్ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టిన‌ట్లు అయింది.

By:  Tupaki Desk   |   28 Aug 2023 6:53 AM GMT
స‌మ‌స్య చిన్న‌దే..అందుకే మ‌లైకా-అర్జున్ మ‌ళ్లీ క‌లిసారా?
X

బాలీవుడ్ జోడీ మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ ప్రేమ‌బంధం వీగిపోయింద‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ద్య పొరొపొచ్చాలు రావ‌డంతో! అర్జున్ క‌పూర్ కొత్త గాళ్ల్ ప్రెండ్ ని కుషా క‌పిల‌కు ద‌గ్గ‌రైన‌ట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. అంత‌కు ముందు అర్జున్ క‌పూర్ స‌హా కుటుంబ స‌భ్యులు-మ‌లైకా మ‌ధ్య అకౌంట్లు బ్లాకింగ్ వ్య‌వ‌హారం అంత‌కంత‌కు ఈబ్రేక‌ప్ స‌న్నివేశాన్ని హీటెక్కించింది.

గ‌త రెండు మూడు రోజులుగా మీడియాలో ఇదే అంశం హైలైట్ అవుతుంది. అయితే తాజాగా ఒక్క ఫోటోతో ఈ జంట బ్రేక‌ప్ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టిన‌ట్లు అయింది. ఆదివారం అర్జున్ క‌పూర్-మ‌లైకా అరోరా జంట‌గా ముంబైలో డిన్నర్ డేట్ కి వెళ్లొచ్చారు. రాత్రి రెస్టారెంట్ నుండి ఇద్ద‌రు జంట‌గా బ‌య‌ట‌కు రావ‌డం ఫాలోవ‌ర్స్ కి గుడ్ న్యూస్ లా అనిపిస్తుంది. మలైకా సొగసైన తెల్లటి కోటు మరియు మ్యాచింగ్ ప్యాంట్‌ధ రించ‌గా... అర్జున్ ఆలివ్ గ్రీన్ స్వెట్‌షర్ట్- గ్రే ప్యాంట్ - స్నీకర్లను ధరించాడు.

మ‌లైకా ముందు న‌డుస్తుండ‌గా..ఆమె వెంట అర్జున్ క‌పూర్ న‌డుచుకుంటూ వ‌స్తున్నాడు. అంత‌కు ముందు లంచ్ స‌మ‌యంలోనూ జంట‌గా క‌నిపించారు. ఇద్ద‌రు ఆనందంగా..సంతోషంగా ఉన్న‌ట్లు మీడియాలో క‌నిపించారు.

ఆ ఫోటోలు నెట్టింట జోరుగా వైర‌ల్ అయ్యాయి. కింద కామెంట్ బాక్స్ లో విడిపోయిన జంట మ‌ళ్లీ ఎలా క‌లిసారు? అంటూ కొన్ని పోస్ట్ లు వైర‌ల్ అవ్వ‌గా ఆ ఇద్ద‌రు విడిపోలేదు ..అదంతా త‌ప్పుడు ప్రచారం అంటూ ఆ జంట ఫాలోవ‌ర్స్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు.

దీంతో ఆ జంట‌పై నెట్టింట జ‌రుగుతోన్న ప్ర‌చార‌మంతా త‌ప్ప‌ని తెలుస్తుంది. ఒక‌వేళ ఇద్ద‌రి మ‌ధ్య చిన్న పాటి వివాదాలు ఏవైనా త‌లెత్తి ఉంటే తాజాగా ప‌రిష్క‌రించుకుని ఇలా క‌లిసిపోయి ఉండొచ్చ‌ని తెలుస్తుంది. జంట‌ల మ‌ధ్య చిన్న చిన్న పొర‌పొచ్చాలు స‌హ‌జ‌మే. వాటిని విశ్లేషిస్తే విడిపోయేంత‌గా దారి తీసే కార‌ణాలు అందులో క‌నిపించ‌వు. బ‌హుశా ఇద్ద‌రి మ‌ధ్య అలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకుని ఉండొచ్చ‌ని తెలుస్తోంది.