Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : 51 ఏజ్‌లో 'మసాలా' పిక్స్‌ అదుర్స్‌

పాతికేళ్ల పడుచు హీరోయిన్‌ మాదిరి మసాలా కవర్‌ ఫోటోలో మలైకా కనిపిస్తోంది అంటూ అభిమానులతో పాటు అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   10 Sept 2025 12:03 PM IST
పిక్‌టాక్‌ : 51 ఏజ్‌లో మసాలా పిక్స్‌ అదుర్స్‌
X

బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి హిందీ ప్రేక్షకులను మెప్పించిన మలైకా అరోరా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి పలు ఐటెం సాంగ్స్‌ను చేసింది. మలైకా అరోరా అనగానే ఐటెం సాంగ్స్ గుర్తుకు వచ్చే స్థాయిలో ఆమె చేసిన పాటలు హిట్ అయ్యాయి. 1998లో చేసిన చయ్య చయ్య సాంగ్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు. తెలుగులో ఈమె చేసిన కెవ్వు కేక పాట ఐదేళ్ల పాటు తెగ వైరల్ అయింది. అన్ని చోట్ల ఆ పాట గురించి చర్చ, ఎక్కడ చూసినా మలైకా అరోరా డాన్స్ గురించి కామెంట్స్. ఆ స్థాయిలో తన డాన్స్‌తో, అందంతో మెప్పించిన మలైకా అరోరా ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. కానీ సోషల్‌ మీడియాలో తన అందాల ఆరబోతతో మాత్రం రెచ్చి పోతూనే ఉంది. ఇటీవలే అయిదు పదుల వయసు క్రాస్ చేసిన మలైకా ఇప్పటికీ పాతికేళ్ల పడుచు అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది.

మలైకా అరోరా మ్యాగజైన్‌ ఫోటో షూట్‌

సాధారణంగా మ్యాగజైన్‌లపై యంగ్‌ స్టార్‌ హీరోయిన్స్ ఫోటోలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ యంగ్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ముద్దుగుమ్మ మలైకా అరోరా యొక్క ఫోటోలు ఎక్కువగా మ్యాగజైన్‌పై చూస్తూ ఉంటాం. తాజాగా ఈమె మసాలా అనే మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాతికేళ్ల పడుచు హీరోయిన్‌ మాదిరి మసాలా కవర్‌ ఫోటోలో మలైకా కనిపిస్తోంది అంటూ అభిమానులతో పాటు అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా మూడు పదుల వయసులోనే హీరోయిన్స్‌ను చూడలేం. కానీ మలైకా అయిదు పదుల వయసు దాటి ఒక ఏడాది అయినా ఇప్పటికీ ఇంకా ఇంత అందంగా ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందంగా కనిపించడంకు కారణం ఏంటా అని చాలా మంది ఈమెను ప్రశ్నిస్తూ ఉంటారు.

సోషల్‌ మీడియాలో మలైకా అరోరా అందాల ఫోటోలు

తాజాగా ఈమె మసాలా కవర్‌ ఫోటో కోసం ఇచ్చిన ఫోటో షూట్‌లో సింపుల్‌ హెయిర్‌ స్టైల్‌తో అలరించింది. అంతే కాకుండా ఆకట్టుకునే అందమైన ఔట్‌ ఫిట్‌ను ధరించడం ద్వారా మలైకా అరోరా యంగ్‌ హీరోలకు కాంపిటీషన్‌గా నిలిచింది. క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతున్న మలైకా అరోరా కవ్వించే విధంగా ఫోజ్ ఇవ్వడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ను ఈమె సొందం చేసుకుంది. ఈమె ఇప్పటికీ ప్రతి రోజు గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమె ఇంత అందంగా, ఫిజిక్‌గా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు, ఈమె ఫోటో జెనిక్ ఫేస్‌ కావడం వల్ల అభిమానులు ఎప్పుడు ఈమె ఫోటోలు షేర్‌ చేసినా తెగ లైక్ చేస్తూ షేర్‌ చేసి వైరల్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం.

బాలీవుడ్‌లో మోడల్‌గా మలైకా ఎంట్రీ

మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా అరోరా చెంబూర్‌లోని స్వామి వివేకానంద పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత పెద్దగా చదువుకోకుండానే మోడలింగ్‌ పై దృష్టి సారించింది. మలైకా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడి పోయారు. ఇద్దరి నుంచి మలైకా దూరంగా ఉండాలి అనుకుంది. ఆ సమయంలో ఆమె మనస్థత్వం అత్యంత సున్నితంగా ఉండేదట. తన తల్లి వద్ద పెరిగినప్పటికీ ఎక్కువగా ఒంటరి జీవితంను సాగించాను అని పలు ఇంటర్వ్యూల్లో మలైకా చెబుతూ ఉంటుంది. తల్లి క్రైస్తవురాలు కావడంతో ఆమె ఎక్కువగా క్రిస్టియన్‌ పద్దతులను పాటిస్తుందని అంటారు. అలాగే ఆమె తండ్రి పంజాబీ హిందూ కావడంతో ఆమె హిందూ సాంప్రదాయాలను నమ్ముతుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న మలైకా ఆ మధ్య ఒక యంగ్‌ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ యంగ్‌ హీరోతో బ్రేకప్‌ కావడంతో పెళ్లి క్యాన్సల్‌ అయినట్లు తెలుస్తోంది.