వయసు నంబర్ మార్చేస్తే ఎలా మలైకా?
గ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో మాయా మశ్చీంద్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. పిమ్మిని బమ్మిని చేసే మాయావులకు కొదవేమీ లేదు.
By: Sivaji Kontham | 24 Oct 2025 5:28 PM ISTగ్లామ్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో మాయా మశ్చీంద్రల గురించి ఎంత చెప్పినా తక్కువే. పిమ్మిని బమ్మిని చేసే మాయావులకు కొదవేమీ లేదు. ఒక్కోసారి వయసు ఒక నంబర్ మాత్రమేనని భ్రమింపజేసే మాయా మోహినులు ఇక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఇప్పుడు అదే కేటగిరీలో చేరిపోయింది మలైకా అరోరా ఖాన్.
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! అనే రేంజులో చెలరేగిపోతూ నిరంతర ఫోటోషూట్లతో మాయ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ వయసు ఎంతో ఎవరైనా కనిపెట్టగలరా? జస్ట్ 30 ప్లస్ అని చెప్పినా నమ్మేయాల్సిందే. అంతగా గ్లామరస్ ఎలివేషన్స్ పై ఫోకస్ పెట్టే ఈ బ్యూటీ ఇటీవల తన బర్త్ డే పార్టీతో మరోసారి చర్చల్లోకొచ్చింది.
ప్రస్తుతం మలైకా పుట్టినరోజు వేడుకల ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈసారి బర్త్ డేలో మలైకా ఊహించని విధంగా అడ్డంగా దొరికిపోయింది. బర్త్ డే కేక్ పై 50 నంబర్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని అర్థం మలైకా వయసును ఫేకింగ్ చేస్తోందా? అంటూ పలువురు నెటిజనులు ఆరాలు తీయడం ప్రారంభించారు. అంతేకాదు కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి మలైకా 2019లో 47వ బర్త్ డే వేడుకలు జరుపుకున్న వీడియోలు ఫోటోలను కూడా కనిపెట్టి వెలికి తీసారు.
ఒకవేళ 2019లో 47వ బర్త్ డే జరుపుకున్నట్టయితే, 2022 నాటికి మలైకా వయసు 50. కానీ 2025లో వయసు 50కి ఎలా తగ్గిపోయింది? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు నెటిజనులు. అయినా మనసుంటే మార్గం లేకపోలేదు.. వయసు ఒక నంబర్ మాత్రమే!నని బలంగా విశ్వసించే గొప్ప అభిమానులు మలైకాకు ఉన్నారు.
ఆన్ లైన్ లో ఒక సెక్షన్ ట్రోలింగ్ లో బిజీ బిజీగా ఉంది.. మలైకా ఇప్పటివరకూ దీనిపై స్పందించలేదు. ఈ బ్యూటీ పార్టీలతో పాటు సినిమాలు, రియాలిటీ షోలతోను బిజీ బీజీగా ఉంది. 50 ప్లస్ లోను హిందీ చిత్రసీమలో బిజీ నటిగా కొనసాగుతున్న మలైకా అరోరా చాలా మందికి ఫిట్నెస్ పరంగాను స్ఫూర్తిగా నిలుస్తోంది.
ది తాజ్ స్టోరీ, మస్తీ 4, హక్, హలో కౌన్, 120 బహదూర్, కాశీ టు కాశ్మీర్, డ్యాన్సింగ్ డాడ్, జీనత్ ఇలా వరుస చిత్రాలతో మలైకా కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉంది.
