Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : మేడం మలైకా వయసు తగ్గుతూనే ఉందా?

సాధారణంగా హీరోయిన్స్‌ గతంలో మూడు పదుల వయసు దాటిన తర్వాత కనుమరుగయ్యే వారు.

By:  Tupaki Desk   |   14 July 2025 3:00 PM IST
పిక్‌టాక్‌ : మేడం మలైకా వయసు తగ్గుతూనే ఉందా?
X

సాధారణంగా హీరోయిన్స్‌ గతంలో మూడు పదుల వయసు దాటిన తర్వాత కనుమరుగయ్యే వారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్‌ మాత్రం నాలుగు పదుల వయసులోనూ అందంగా, పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు పోటీ అన్నట్లుగా అందంగా కనిపిస్తున్నారు. ఎంతో మంది సీనియర్‌ హీరోలతో ఈ నాలుగు పదుల వయసు ఉన్న ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్‌ వారి వయసుతో పోల్చితే చాలా తక్కువ వయసు వారిగా కనిపిస్తూ ఉంటారు. వారు ధరించే ఔట్‌ ఫిట్ లేదా, వారు వేసుకునే మేకప్‌ వల్ల అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక సమయంలో వారి నిజమైన వయసు కనిపించక మానదు. కానీ మలైకా అరోరా వయసు మాత్రం పెరగకుండా తగ్గుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.


ప్రస్తుతం మలైకా అరోరా వయస్సు అయిదు పదులు దాటింది. అయినా ఆమె అందం చూస్తే కుర్రకారు చూపు తిప్పలేరు. అందం విషయంలో ఈ అమ్మడిని కొట్టే వారు లేరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలతో వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా తన కొడుకుతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లిన మలైకా అరోరా కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఆ ఫోటోల్లో ఈ అమ్మడి అందం చూస్తూ ఈమెకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ షాక్ అవ్వక మానరు. మలైకా అరోరా గతంతో పోల్చితే మరింత అందంగా, సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా కనిపిస్తున్న మలైకా అరోరా సినిమాల్లో నటించక పోవడం బాధను కలిగిస్తుందని కొందరు అంటున్నారు.


ఇటీవల కొడుకు అర్హాన్‌తో కలిసి మలైకా హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలను షేర్‌ చేసింది. ఈమె షేర్‌ చేసిన కొన్ని ఫోటోల్లో గతంతో పోల్చితే మరింత అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్లోజప్‌లోనూ మలైకా అరోరా అంతకు మించి అందంగా కనిపిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేసిన మలైకా అరోరా కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం అయింది. తిరిగి ఆమె ఇండస్ట్రీలో బిజీ కావాలని, సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఈమె ఒక యంగ్‌ హీరోతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య ఆ హీరోతో ఈమె దూరంగా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి.


మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా అరోరా ఎంటీవీ ఇండియా షో లు ప్రారంభం అయినప్పుడు వీజేగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సెన్సాఫ్‌ హ్యూమర్‌తో పాటు, ఆమె యొక్క అందం కారణంగా తక్కువ సమయంలో చాలా పెద్ద పేరు దక్కించుకుంది. దాంతో సినిమాల్లోనూ ఎంట్రీ దక్కించుకుంది. 1998లో బాలీవుడ్‌ చిత్రం దిల్‌ సే లో చయ్యా చయ్యా పాటలో నటించడం ద్వారా మొత్తం దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్‌ సినిమాలో మున్నీ బద్నామ్‌ హుయ్‌ అనే ఐటెం సాంగ్‌లో నటించి మరోసారి మొత్తం దేశ వ్యాప్తంగా మ్యూజిక్ ప్రియులను షేక్ చేసింది. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగానూ మలైకా వ్యవహరించింది.