Begin typing your search above and press return to search.

మలైకాను ఇలా చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కెవ్వు కేక‌

వేడెక్కించే ఫోజుల‌తో వెబ్‌ను తగలబెట్టడం ఎలానో మ‌లైకాకు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీదేమో! తాజాగా మ‌రోసారి 51 ఏళ్ల మ‌లైకా చెల‌రేగి ఫోజులిచ్చింది

By:  Tupaki Desk   |   24 April 2025 11:24 PM IST
మలైకాను ఇలా చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ కెవ్వు కేక‌
X

వేడెక్కించే ఫోజుల‌తో వెబ్‌ను తగలబెట్టడం ఎలానో మ‌లైకాకు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలీదేమో! తాజాగా మ‌రోసారి 51 ఏళ్ల మ‌లైకా చెల‌రేగి ఫోజులిచ్చింది. తాజా ఫోటోషూట్‌లో రెడ్ హా* లుక్ తో ఈ బ్యూటీ మైండ్ బ్లాక్ చేసింది. మ‌లైకా ఎరుపు రంగు బాడీ కాన్ దుస్తుల్లో సెల్ఫీలు దిగుతూ బోల్డ్ పోజ్ ల‌తో రెచ్చిపోయి అందాలను ప్రదర్శించింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్ష‌ణాల్లో వైరల్ గా మారింది. నెటిజనులు మలైకా లుక్స్ పై ప్రశంసలు కురిపించడంలో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. ఒక నెటిజ‌న్ `వ్వావ్ బ్యూటీ` అంటూ పొగిడేయ‌గా, మరొక అభిమాని గుడ్నెస్ గ్రేషియస్..ఎర్రటి దుస్తులు, ఎర్రటి పెదవులు, ఎర్రటి హా* యాటిట్యూడ్!! అని వ్యాఖ్యానించారు. అయితే మ‌లైకా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో మిడ్ రిఫ్ ని ప్ర‌ద‌ర్శించిన ఓ ఫోటోగ్రాఫ్ లో న‌డుముపై స్ట్రెచ్ మార్క్స్ క‌నిపిస్తున్నాయి. మ‌లైకా లేట్ ఏజ్ ల‌ను త‌న అందాల‌ను కాపాడుకునేందుకు నిరంత‌రం యోగా, మెడిటేష‌న్, జిమ్ తో త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది. కానీ ఏజ్ ని మాత్రం దాచ‌లేక‌పోతోంది. కొన్నేళ్ల క్రితం గ‌బ్బ‌ర్ సింగ్ లో కెవ్వు కేక ఐట‌మ్ పాట‌లో న‌ర్తించిన మ‌లైకా వృద్ధాప్య ఛాయ‌ల‌పై చాలా విమ‌ర్శ‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పాట‌లో మ‌లైకా లుక్స్ కుర్ర‌కారును అస్స‌లు ఆక‌ట్టుకోలేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్రస్తుతం రెమో డిసౌజాతో కలిసి `హిప్ హాప్ ఇండియా 2` అనే డ్యాన్స్ రియాలిటీ షోకు జ‌డ్జిగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర‌పై ప‌లు డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు. ఇటీవ‌ల అర్జున్ క‌పూర్ నుంచి విడిపోయాక సోలో లైఫ్ ని లీడ్ చేస్తూ కెరీర్ పైనే మ‌లైకా ఫోక‌స్ చేస్తోంది.