Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్‌తో మ‌లైక అరోరా డేటింగ్?

న‌టి మలైకా అరోరా మాజీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కరతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   31 March 2025 10:00 PM IST
క్రికెట‌ర్‌తో మ‌లైక అరోరా డేటింగ్?
X

న‌టి మలైకా అరోరా మాజీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కరతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఇద్దరూ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ (RR) డగౌట్‌లో ఉన్న ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను ఆస్వాధిస్తున్న నటి మలైకా అరోరా, శ్రీలంక మాజీ క్రికెటర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, ప్రస్తుతం క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కుమార్ సంగక్కరతో కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఆదివారం నాటి మ్యాచ్ లో ఈ జంట అంద‌రి దృష్టిని విశేషంగా ఆక‌ర్షించింది.

మలైకా రాయల్స్ జెర్సీలో ఉన్నట్లు చూపించే క్లిప్‌ల నుండి స్క్రీన్‌షాట్‌లు వైరల్ అవుతున్నాయి. RR డగౌట్‌లో మ‌లైకా ఎందుకు ప్ర‌వేశించింది? అంటూ నెటిజ‌నులు ఆరాలు తీస్తున్నారు. ఈ జంట‌ను చూశాక రెడ్డిట‌ర్లు అస్స‌లు ఆగ‌లేక‌పోతున్నారు. వెంట‌నే ఊహాగానాలు ప్రారంభించారు. అస‌లు ఆ టీమ్‌తో మ‌లైకా సంబంధం ఏమిటో తెలుసుకోవాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అంతేకాదు.. మలైకా- కుమార్ సంగ‌క్క‌ర‌ కలిసి తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో న‌డుస్తోంది! అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మలైకా అరోరా కుమార్ సంగక్కరతో క‌లిసి కూర్చున్నారు. ఏదో జ‌రుగుతోంది! ఆర్ఆర్ టీమ్ తో మ‌లైకాకు ఎలాటి సంబంధం కనిపించడం లేదు! అని నెటిజ‌నులు వ్యాఖ్యానించారు.

అయితే ఇద్దరు వ్యక్తులు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నంత మాత్రాన వారు డేటింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలా? ఇది స‌రైన‌దేనా? మీడియా ఇలాంటి నిరాధారమైన కథలు కల్పించడం మానేయాలి! అని ఆ ఇద్ద‌రికీ చెందిన సోర్స్ ఖండించిన‌ట్టు తెలుస్తోంది.

నటుడు అర్జున్ కపూర్ సింగిల్ అని ప్ర‌క‌టించిన త‌ర్వాత అత‌డు మ‌లైకా నుంచి దూరంగా ఉంటున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. మలైకా- అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. గత సంవత్సరం అక్టోబర్‌లో సింగం ఎగైన్ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్ లో బ్రేక‌ప్ ని అత‌డు ధృవీకరించారు.