Begin typing your search above and press return to search.

చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్న 50ఏళ్ల బ్యూటీ

మలైకా అరోరా వయస్సు తో సంబంధం లేకుండా స్టైల్, గ్రేస్, ఆత్మవిశ్వాసంతో స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి పాపుల‌రైంది.

By:  Tupaki Desk   |   16 Sept 2025 8:00 AM IST
చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్న 50ఏళ్ల బ్యూటీ
X

నేటి జెన్ జెడ్ ఫ్యాష‌నిస్టాల‌కైనా చెమ‌ట‌లు ప‌ట్టించే అందం, స్టైల్ మలైకా అరోరా సొంతం. 50 వ‌య‌సులోను ఏజ్ లెస్ బ్యూటీగా మైమ‌రిపిస్తోంది. ఈ బ్యూటీ ఫ్యాష‌న్ సెన్స్, ఆరోగ్యంపై అవగాహ‌న ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మైన‌ది.కెమెరా ముందు ఎన‌ర్జిటిక్ పాత్ర‌ను పోషిస్తోంది. రియాలిటీ షో క్వీన్ గా మెరిసిపోతోంది.

మలైకా అరోరా వయస్సు తో సంబంధం లేకుండా స్టైల్, గ్రేస్, ఆత్మవిశ్వాసంతో స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి పాపుల‌రైంది. ఈ బ్యూటీ నిరంత‌ర‌ ఉత్సాహం, ఆత్మ‌ విశ్వాసం, షో స్టాపింగ్ అడ్వెంచ‌ర్స్ తో నిరంత‌రం యువ‌త‌రంలో చ‌ర్చ‌గా మారుతోంది. ఇప్పుడు మ‌రోసారి మ‌లైకా ఫ్యాష‌న్ సెన్స్ ని ఎలివేట్ చేసే ఫోటోషూట్ ఇన్ స్టాలో వైర‌ల్ గా షేర్ అవుతోంది.

మై మెనీ మూడ్స్ పేరుతో మ‌లైకా త‌న మూడ్స్ అన్నిటినీ ప్ర‌ద‌ర్శించే కొన్ని అరుదైన ఫోటోల‌ను కూడా షేర్ చేసింది. వీటిలో మ‌లైకా త‌న ప‌ప్పీ తో క‌లిసి యోగాభ్యాసం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోగ్రాఫ్, పూల్ లో స్పెష‌ల్ గాగుల్స్ తో క‌నిపించిన ఫోటోగ్రాఫ్, ఫైవ్ స్టార్స్ లో ఆహారం స్వీక‌రించే విధానం ఇలా ప్ర‌తిదీ ఫోటోల రూపంలో మ‌లైకా షేర్ చేసింది. ఇప్పుడు అవ‌న్నీ వైర‌ల గా మారుతున్నాయి. త‌ళుకుబెళుకుల‌ లెహంగా స‌హా ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో మ‌లైకా ఫోజులు గుబులు పుట్టిస్తున్నాయి. మ‌లైకా ధ‌రించిన‌ బోల్డ్ గ్రీన్ సెట్ త‌న‌లోని ఎగ్జ‌యిట్ మెంట్ పెంచే కోణాన్ని ప్రదర్శించింది.

మహారాష్ట్ర -థానేలో 23 అక్టోబర్ 1973న జన్మించిన మలైకా అరోరా పాపుల‌ర్ నటి, నర్తకి, మోడల్, రియాలిటీ స్టార్. ఛ‌య్య ఛ‌య్య -మున్నీ బ‌ద్నామ్ హుయ్ లాంటి పాట‌లతో కెరీర్ ఆరంభ‌మే మంచి పేరొచ్చింది. ఎంటీవీ VJగా ప్రారంభించి, అటుపై మోడలింగ్ లోను రాణించింది అనుష్క‌. ఈ బ్యూటీ ఇటీవ‌ల డ్యాన్స్ రియాలిటీ షోల‌ జడ్జిగా అల‌రిస్తోంది. తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్, ఫిట్‌నెస్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.