Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో స్టార్ క‌మెడియ‌న్ మేన‌ల్లుడు!

శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మ‌వ్వడం విశేషం. 'మ్యాక‌ప్ మేన్' అనే సినిమాతో శ్రీకాంత్ ఆవుటూరి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

By:  Tupaki Desk   |   14 April 2024 2:30 PM GMT
ఇండ‌స్ట్రీలో స్టార్ క‌మెడియ‌న్ మేన‌ల్లుడు!
X

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు స్టార్ క‌మెడియ‌న్ గా ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం అందించిన సేవ‌ల గురించి చెప్పా ల్సిన ప‌నిలేదు. ఎన్నో చిత్రాల్లో త‌న‌దైన శైలి హాస్యంతో క‌డుపుబ్బా న‌వ్వించిన గొప్ప హాస్య‌న‌టుడిగా నీరాజ‌నాలు అందుకున్నారు. కామెడీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌తను చాటుకున్నారు. కామెడీలో కొత్త శైలిని ప‌రిచ‌యం చేసిన న‌టుడాయ‌న‌. అంత‌టి పేరున్న న‌టుడి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఎవ‌రూ లేరు.

పిల్ల‌లంతా వివిధ వృత్తుల్లో స్థిర‌ప‌డ‌టంతో సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే చాలా కాలానికి ఆయ‌న మేన‌ల్లుడు శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మ‌వ్వడం విశేషం. 'మ్యాక‌ప్ మేన్' అనే సినిమాతో శ్రీకాంత్ ఆవుటూరి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. దివాక‌ర్ య‌డ్ల దర్శ‌క‌త్వంలో ఈచిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ద్వారా ప‌రిశ్ర‌మ‌లో మ్యాక‌ప్ మేన్ ల జీవితాలు ఎలా ఉంటాయి? అన్న‌ది హైలైట్ చేయ‌బోతున్నారు.

మ‌రి ఆ పాత్ర‌కు శ్రీకాంత్ ఎంత‌వ‌ర‌కూ సెట్ అయ్యాడు? సినిమా ఎలా ఉంటుంది? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు నిర్ణ‌యిస్తారు. ధ‌ర్మ‌వ‌రం బ్రాండ్ అనేది శ్రీకాంత్ కి ఎంట్రీ కార్డు వ‌ర‌కే ప‌రిమితం. ఆ త‌ర్వాత న‌టుడిగా నిరూపించు కోవాల్సింది తానే. శ్రీకాంత్ కిది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. క‌మెడియ‌న్ల వార‌స‌త్వం తో ఇండస్ట్రీలో కి వ‌చ్చి నిల‌బ‌డింది చాలా త‌క్కువ మందే. చాలా మంది కొన్ని సినిమాలు చేసి మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకున్నారు.

మూడు..నాలుగు సినిమాలు చేసి స‌రైన ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో తిరిగి వెన‌క్కి వెళ్లిపోయారు. వారితో పొల్చితే ఆ మాత్రం బ్యాక్ గ్రౌండ్ కూడా లేకుండా వ‌చ్చి స‌క్సెస్ అయిన వారున్నారు. మ‌రి శ్రీకాంత్ జ‌ర్నీ ఎలా సాగుతుంది? ఎలాంటి స్ట్రాట‌జీతో కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు? ఇండ‌స్ట్రీ వాతావ‌ర‌ణ అత‌నికి ఎంత‌వ‌ర‌కూ అల‌వాటైంది? అన్న‌ది తెలియాలి. త్వ‌ర‌లోనే మ్యాక‌ప్ మేన్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది.