Begin typing your search above and press return to search.

ఫ్రీజ్ చేసే ద‌ట్ట‌మైన అడ‌విలో మ‌హేష్ సాహ‌సం

గ‌డ్డ క‌ట్టించే చ‌లిలో ద‌ట్టమైన (బ్లాక్) అడ‌విలో మ‌హేష్ సాహ‌సాల‌కు రెడీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Jan 2024 6:39 PM GMT
ఫ్రీజ్ చేసే ద‌ట్ట‌మైన అడ‌విలో మ‌హేష్ సాహ‌సం
X

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 చిత్రానికి ప్రిప‌రేష‌న్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప‌నిలోకి దిగితే రాక్ష‌సుడే అత‌డు. త‌న ప్రిప‌రేష‌న్ ఏ రేంజులో ఉంటుందో తెలుసుకునేందుకు ఇదిగో తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన‌ ఈ ప్రూఫ్ స‌రిపోతుంది.


గ‌డ్డ క‌ట్టించే చ‌లిలో ద‌ట్టమైన (బ్లాక్) అడ‌విలో మ‌హేష్ సాహ‌సాల‌కు రెడీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. డాక్ట‌ర్ హారీ కె స‌మ‌క్షంలో మ‌హేష్ ఈ సాహ‌సానికి పూనుకున్నాడు. గ‌డ్డ క‌ట్టించే ఉష్ణోగ్ర‌త‌లో బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తున్నామ‌ని మ‌హేష్ తెలిపారు. అయితే త‌న‌తో పాటే డాక్ట‌ర్ కూడా ఉన్నారు అంటే ఎంత జాగ్ర‌త్త‌గా దీనిని ప్లాన్ చేసారో అర్థం చేసుకోవ‌చ్చు.


#బ‌డెన్ బ‌డెన్ # నేచుర్ # బ్లాక్ ఫారెస్ట్ అంటూ ట్యాగ్ ల‌ను మ‌హేష్ షేర్ చేసారు. ఇక ఈ ట్యాగుల‌కు త‌గ్గ‌ట్టే అడ‌విలో అందాల‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. అస‌లే ప‌ర్వ‌త ప్రాంతాలు అక్క‌డ చెట్ల‌తో నిండి ఉంది. వాటి మ‌ధ్య‌లోంచి చెట్ల కొమ్మ‌లు రెమ్మ‌లు ఆకుల్లోంచి సూర్య కాంతి ప్ర‌స‌రిస్తున్న తీరు చూస్తుంటే ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త ఎంత మైమ‌రిపించ‌నుందో అర్థం చేసుకోవ‌చ్చు.

క్రికెట‌ర్లు విదేశాల్లో శీత‌ల లేదా ఉష్ణ‌మండ‌లాల‌కు ఆట కోసం వెళితే, చాలా ముందు నుంచే అక్క‌డికి చేరుకుని వాతావ‌ర‌ణం అల‌వాటు ప‌డాల్సి ఉంటుంది. ఇప్పుడు మ‌హేష్ కూడా అలాంటి ప్రిప‌రేష‌న్ సాగిస్తున్నాని అర్థ‌మ‌వుతోంది. రాజ‌మౌళి ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ప్ర‌కారం ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ట్రెక్కింగ్ ప్లేస్ ల‌లో సాహ‌సాల‌తో కూడుకున్న యాక్ష‌న్ హీరోయిజం చూపించాల్సి ఉంటుంది. దానికి ముంద‌స్తు ప్రిప‌రేష‌న్ ఇద‌ని భావించాలి. మ‌హేష్ త‌న‌తో పాటే ఫిట్నెస్ డాక్ట‌ర్ హారీని తీసుకుని వెళ్లారు కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నారని భావించాలి. రాజ‌మౌళి సినిమా కోసం మ‌హేష్ మారిన రూపం కూడా తాజా ఫోటోగ్రాఫ్స్ లో క‌నిపిస్తోంది. వ్యాయామం చేయ‌డంతో పాటు, శీతల ప్ర‌దేశంలో అడ‌వుల్లో ఆరోగ్యం కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. దానికి సంబంధించిన ప్రిప‌రేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. షూటింగ్ సాధ్య‌మైన‌త తొంద‌ర్లోనే ప్రారంభం కానుంద‌న‌డానికి ఈ హింట్ స‌రిపోతుంది.