Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం' రిజల్ట్.. మహేష్ కి మొదలైన మరో టెన్షన్?

మొత్తానికి సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఇక్కడే మహేష్ కి సరికొత్త టెన్షన్ మొదలైంది. గుంటూరు కారం డిజాస్టర్ ని మహేష్ బాబు మరో మూడేళ్లు మోయాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 Jan 2024 2:45 AM GMT
గుంటూరు కారం రిజల్ట్.. మహేష్ కి మొదలైన మరో టెన్షన్?
X

'గుంటూరు కారం' సినిమా మహేష్ బాబుకి సరికొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై నెగిటివ్ టాక్ ని మూటకట్టుకుంది. మహేష్ త్రివిక్రమ్ దాదాపు 11 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో రిలీజ్ కి ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత అభిమానులతో పాటు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది.

సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మహేష్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అలాగే 'హనుమాన్' మూవీతో క్లాష్, థియేటర్ల సమస్య వంటి వివాదాల ఎఫెక్ట్ ఈ సినిమాపై గట్టిగానే పడింది. దీంతో 'గుంటూరు కారం' మూవీపై దారుణంగా ట్రోల్ జరుగుతుంది. కేవలం మహేష్ బాబు వల్లే ఈ మూవీ ఆడుతుందని, దీనికన్నా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ బెటర్ అంటూ అభిమానులే బాహాటంగా చెబుతున్నారు.

మొత్తానికి సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఇక్కడే మహేష్ కి సరికొత్త టెన్షన్ మొదలైంది. గుంటూరు కారం డిజాస్టర్ ని మహేష్ బాబు మరో మూడేళ్లు మోయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా కనుక సక్సెస అయి ఉంటే ఆ జోష్ తో మహేష్ రాజమౌళి మూవీని వెంటనే స్టార్ట్ చేసి ఉండేవాడు. అలాగే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ హిట్ అయితే రాజమౌళి సినిమా కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే తలకిందులైంది.

కాబట్టి ఈ ప్లాప్ ను నెత్తిన పెట్టుకొని జక్కన్న ప్రాజెక్ట్ ని మహేష్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో రాజమౌళి భారీ ప్రయోగమే చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రయోగం కాస్త అటు ఇటూ అయితే మహేష్ కి మరిన్ని ఇబ్బందులు తప్పవు.

ఇక మహేష్ బాబు నుంచి వచ్చిన లాస్ట్ బ్లాక్ బస్టర్ 'భరత్ అనే నేను'. ఆ తర్వాత వచ్చిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట.. వంటి సినిమాలు డీసెంట్ హిట్ అనిపించుకున్నయి తప్పితే మహేష్ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అయితే కావు. సో ప్రెజెంట్ మహేష్ హోప్స్ అన్ని రాజమౌళి ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ మరో మూడేళ్లు ఆగక తప్పదు.