Begin typing your search above and press return to search.

మహేష్ ఆ డైరెక్టర్ హిట్టు బాకీ..!

ఇక ఇదిలా ఉంటే సుకుమార్ ఇప్పటివరకు తీసిన హీరోల్లో అందరికీ హిట్ సినిమాలే ఇచ్చినా సూపర్ స్టార్ మహేష్ కి మాత్రం ఫ్లాప్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 3:30 PM GMT
మహేష్ ఆ డైరెక్టర్ హిట్టు బాకీ..!
X

సౌత్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ముందు వరకు కేవలం తెలుగు దర్శకుడిగా మాత్రమే పేరు సంపాదించాడు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ తో సుక్కు రేంజ్ మారిపోయింది. డైరెక్టర్ గా సుకుమార్ స్టామినా ఏంటన్నది ఆ సినిమాతో ప్రూవ్ అయ్యింది. పుష్ప 1 సినిమాతో అల్లు అర్జున్ తో సుకుమార్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉండగా వాటిని అందుకునేందుకు సుకుమార్ భారీ స్కెచ్ వేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే సుకుమార్ ఇప్పటివరకు తీసిన హీరోల్లో అందరికీ హిట్ సినిమాలే ఇచ్చినా సూపర్ స్టార్ మహేష్ కి మాత్రం ఫ్లాప్ ఇచ్చాడు. మహేష్ తో 1 నేనొక్కడినే సినిమా చేసిన సుకుమార్ ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ ని ది బెస్ట్ గా చెప్పుకున్నా కమర్షియల్ గా మాత్రం ఆ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు.

1 నేనొక్కడినే ఫ్లాప్ లో ఎవరి శాతం ఎంత అన్నది పక్కన పెడితే సుకుమార్, మహేష్ ఈ ఇద్దరు మళ్లీ సినిమా చేయాలని చూస్తున్నారు. ఆమధ్య మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ కి తాను హిట్టు బాకీ ఉన్నాడని చెప్పాడు. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. అందరి హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చిన సుకుమార్ మహేష్ కి హిట్ ఇవ్వలేదు. అందుకే సుకుమార్ నెక్స్ట్ సినిమాల హీరోల లిస్ట్ లో మహేష్ కూడా ఉన్నాడు.

మహేష్ తో సుకుమార్ సినిమా చేస్తే ఈసారి కచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది చెప్పడం కష్టం. కానీ ఫ్యూచర్ లో మహేష్ తో ఒక భారీ సినిమా చేస్తాడని మాత్రం అర్ధమవుతుంది. ఈ సినిమాతో సుకుమార్ మహేష్ కి ఉన్న హిట్టు బాకీ కూడా తీర్చేయాలని అనుకుంటున్నాడు.

రాజమౌళి సినిమాల తర్వాత ఎలాగు మహేష్ కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు కాబట్టి సుక్కు మహేష్ కాంబో పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. కాకపోతే ఈసారి 1 నేనొక్కడినే లా నిరాశపరచకుండా భారీ ప్లానింగ్ తో ఈ కలయికలో సినిమా ఉండాలని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.