Begin typing your search above and press return to search.

మహేష్ స్పీచ్ లో ఆ సినిమాల ప్రస్తావన రాలేదేంటి..?

అయితే అంతా బాగుంది కానీ సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాల గురించి కూడా మహేష్ ఒక మాట అంటే బాగుండేది కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 9:30 AM GMT
మహేష్ స్పీచ్ లో ఆ సినిమాల ప్రస్తావన రాలేదేంటి..?
X

సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. స్టార్ సినిమాలన్నీ సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఈ పొంగల్ రేసులో మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ సినిమాలు వస్తున్నాయి. సాధారణంగా అయితే సంక్రాంతికి ఎలాగు సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదు కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలి మా వాటితో పాటు వస్తున్న సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుతుంటారు.

మహేష్ గుంటూరు కారం ఈవెంట్ లో మహేష్ మాత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మిగతా సినిమాల ప్రస్తావన తీసుకు రాలేదు. అంతేకాదు ఈసారి గట్టిగా కొడుతున్నామని ఫ్యాన్స్ ని హుశారెత్తించే స్పీచ్ ఇచ్చాడు. సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ కామనే మహేష్ కూడా తన సినిమాల్లో ఎక్కువ శాతం సంక్రాంతికి వచ్చి హిట్ అందుకున్నవే. సంక్రాంతికి ఎవరు వచ్చినా తను కచ్చితంగా హిట్ కొడతాడని మహేష్ నమ్ముతున్నాడు.

అయితే అంతా బాగుంది కానీ సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాల గురించి కూడా మహేష్ ఒక మాట అంటే బాగుండేది కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓ పక్క వెంకటేష్ సైంధవ్ ప్రెస్ మీట్ లో మాత్రం చిన్నోడి సినిమా హిట్ అవ్వాలని అన్నారు. మరి చిన్నోడి మీద పెద్దోడికి ఉన్న అభిమానం పెద్దోడి మీద చిన్నోడికి లేదా ఏంటని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంక్రాంతి లాంగ్ హాలీడేస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకాదరణ లభించడం పక్కా అని చెప్పొచ్చు. మహేష్ సినిమాలు సంక్రాంతికి వస్తే సెపరేట్ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాయి. మహేష్ కి పోటీగా వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, హనుమాన్ సినిమాలు వస్తున్నా మహేష్ గుంటూరు కారమే డామినేట్ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రీ రిలీజ్ బజ్ అలా ఉంటే.. సినిమాలన్నీ రిలీజ్ అయ్యాక కానీ ఎవరి డామినేషన్ ఏంటన్నది క్లారిటీ వస్తుంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 నుంచి 17 వరకు ఆరు ఏడు రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఈ పండుగ రోజుల్లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా మొదట ప్రిఫరెన్స్ సినిమాల మీదే ఉంటుంది. ఫ్యాన్స్ కాకుండా కామన్ ఆడియన్స్ కూడా ఏ సినిమాకు ఎక్కువ ఓటు వేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.