Begin typing your search above and press return to search.

అమ్మ కోసం మహేష్‌..గ్రాండ్ గా ఆవేడుక‌?

కుమార్తె సితార అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప్రాణం. సితార రాక‌తో మ‌హేష్ లో ఎన్నో మార్పులు చూసాం. త‌న జీవితంలో కొత్త ప్ర‌యాణం పిల్ల‌ల రాక‌తో మొద‌లైంద‌ని మ‌హేష్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 7:04 AM GMT
అమ్మ కోసం మహేష్‌..గ్రాండ్ గా  ఆవేడుక‌?
X

కుమార్తె సితార అంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కి ప్రాణం. సితార రాక‌తో మ‌హేష్ లో ఎన్నో మార్పులు చూసాం. త‌న జీవితంలో కొత్త ప్ర‌యాణం పిల్ల‌ల రాక‌తో మొద‌లైంద‌ని మ‌హేష్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. పిల్ల‌లిద్ద‌రికీ కావాల్సినంత స్వేచ్ఛ ఆయ‌న క‌ల్పించారు. గౌత‌మ్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సితార గురించి మ‌హేష్ ఎప్పుడు మాట్లాడినా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. సితార టాపిక్ వ‌స్తే ఆయ‌న ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతారు.

ఇంట్లో చోటు చేసుకునే చిన్న చిన్న విష‌యాలు సైతం షేర్ చేసుకుంటారు. ఎంత ఎదిగినా త‌ల్లిదండ్రు ల‌కు పిల్ల‌లెప్పుడు చిన్న పిల్ల‌లుగానే క‌నిపిస్తారు. సితార విష‌యంలో మ‌హేష్ అలాగే ఫీల‌వుతుంటారు. సితార జ్యూవెల‌రీ పోస్ట‌ర్ అమెరికాలో చూసి ఆయ‌నెంతో మురిసిపోయారో తెలిసిందే. ఇక సితార రూపంలో మ‌హేష్ త‌ల్లి ఇందిరాదేవిలా ఉంటుందంటారు. మ‌హేష్ కూడా సితార‌ని అలాగే పోలిక చేస్తుంటారు.

ఇక మామ్ అంటే మ‌హేష్ కి ఎంతో ఇష్టమో చెప్పాల్సిన ప‌నిలేదు. సితార‌ని సైతం నాయ‌న‌మ్మ అంతే ముద్దు చేసేవారు. నాయ‌న‌మ్మ కూడా సితార‌కు చాలా పంక్ష‌న్లు చేయాల‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ ఆ కోరిక‌లు తీర‌కుండానే ఆమె ఆ కుటుంబానికి దూర‌మ‌య్యారు. దీంతో త‌ల్లి కోరిక‌లు తీర్చ‌డానికి త‌న‌యుడు రంగంలోకి దిగారు. మహేష్ తన ఇంట్లో ఒక శుభకార్యాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు.

సితార లంగా..వోణి ఫంక్షన్ ను నిర్వహించాలని మహేష్ బాబు కుటుంబం నిర్ణయం తీసుకున్నట్టు స‌మాచారం. ముఖ్యంగా మ‌న‌వరాలిని లంగా- వోణీలో చూడాల‌ని నాయ‌నమ్మ ఎంతో ఆశ‌ప‌డ్డారు. అందుకే అమ్మ కోసం మ‌హేష్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చుట్టూలు అంద‌ర్నీ పిలిచి మ‌హేష్ ఈవేడుక గ్రాండ్ గా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌ల్లి-దండ్రుల త‌రుపు బంధువులు అంద‌ర్నీ పిలిచి వేడుక చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఇండ‌స్ట్రీ నుంచి మ‌హేష్ త‌న స్నేహితుల్ని..స‌న్నిహితుల్ని ఆహ్వానించే అవ‌కాశం ఉంది.