Begin typing your search above and press return to search.

మహేష్ - జక్కన్న వచ్చేశారు.. లుక్కు మాత్రం కేక!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 4:44 AM GMT
మహేష్ - జక్కన్న వచ్చేశారు.. లుక్కు మాత్రం కేక!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రం గ్రాండ్ గా పట్టాలెక్కనుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది.

అయితే సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో జక్కన్న- మహేష్ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని ఇటీవల విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను అడ్వాన్స్ టెక్నాలజీతో రాజమౌళి రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్ తో పాటు చాలా పాత్రల కోసం హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకున్నట్లు సమాచారం. అలాగే సరికొత్తగా మహేష్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమన్నారు. రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి దుబాయ్ నుండి తిరిగి వస్తూ కనిపించారు. దీంతో మహేష్ బాబును చూడటానికి అభిమానులు, ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రజలు ఎగబడ్డారు.

అయితే వీరు ముగ్గురు SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు లుక్ మాత్రం అదిరిపోయింది. సూపర్ స్టార్.. ఈ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. గుబురు గడ్డంతో, జులపాల జుట్టుతో మెలితిప్పిన మీసంతో ఆయన లుక్ సర్ప్రైజింగ్ గా ఉంది. ప్రస్తుతం మహేష్ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ డైనమిక్ గా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

హెయిర్ ఎక్కువగా ఉంది కనుక కనపడకుండా ఉండటానికి మహేష్ క్యాప్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా మహేష్ ఎక్కువ హెయిర్, గడ్డంతో చాలా తక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.