Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్.. మహేశ్, రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ వైరల్

ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 10:14 AM GMT
ఫ్లాష్ బ్యాక్.. మహేశ్, రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ వైరల్
X

అతడు, ఖలేజా తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. చాలా ఏళ్ల తర్వాత మహేశ్.. ఫుల్ మాస్ యాక్షన్ రోల్ లో నటిస్తుండడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు.

ఇక, గుంటూరు కారం మేకర్స్ కూడా వరుస అప్డేట్లతో సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ఎన్నడూ లేనంతగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. నిన్ననే గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. తొలుత హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేసినా.. కొన్ని కారణాల వల్ల మహేశ్ సొంతూరులోనే నిర్వహించింది.

ఈ మూవీలో మహేశ్ సరసన హీరోయిన్లుగా యంగ్ బ్యూటీలు శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు నటించారు. వీరితోపాటు జగపతిబాబు, బ్రహ్మనందం, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. అయితే సినిమాలో మహేశ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించింది. ట్రైలర్ ద్వారా ఈ విషయం అర్థమైంది. చెప్పాలంటే మూవీ స్టోరీ అంతా ఆమె చుట్టూనే తిరుగుతున్నట్లు ట్రైలర్ ద్వారా ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.

ఫేమస్ నవల కీర్తి కిరీటాలు ఆధారంగా మేకర్స్ ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. తాజాగా మహేశ్, రమ్యకృష్ణకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 2004లో ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేశ్ నటించిన నాని మూవీ విడుదలైంది. ఆ మూవీలో రమ్యకృష్ణ సాంగ్ లో కనిపించింది. మార్కండేయ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లో మహేశ్ తో రమ్యకృష్ణ చిందులు వేసింది.

కానీ ఆ తర్వాత సాంగ్ ను మేకర్స్ సినిమా నుంచి డిలీట్ చేసేశారు. యూట్యూబ్ లో మాత్రం ఉండడంతో నెటిజన్లు.. ఈ పాట గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. సాంగ్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడు రొమాంటిక్ సాంగ్ లో నటించి ఇప్పుడు తల్లిగా యాక్ట్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం రమ్యకృష్ణకు సపోర్ట్ గా .. సినిమాల్లో పాత్రలను పర్సనల్ గా చూడకూడదని అంటున్నారు. గతంలో ఇలా చాల సార్లు జరిగిందని.. ఇది కామన్ అని చెబుతున్నారు.