Begin typing your search above and press return to search.

మహేష్ - రాజమౌళి.. ఈసారి కూడా తప్పించుకుంటారా?

ఒకవైపు సూపర్ స్టార్ మరొకవైపు పాన్ ఇండియా నంబర్ వన్ దర్శకుడు ఈ రెండు బ్రాండ్స్ కలిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:47 AM GMT
మహేష్ - రాజమౌళి.. ఈసారి కూడా తప్పించుకుంటారా?
X

రాజమౌళి మహేష్ కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవైపు సూపర్ స్టార్ మరొకవైపు పాన్ ఇండియా నంబర్ వన్ దర్శకుడు ఈ రెండు బ్రాండ్స్ కలిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో RRR విడుదల కంటే ముందు సినిమా రాబోతుంది అనే అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాత్రమే సినిమా గురించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని మహేష్ బాబు ఒక అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో రాబోతున్నాడు అని రాజమౌళి RRR కంటే హై రేంజ్ లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు అని కూడా అన్నారు.

అయితే ఆ అప్డేట్ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఏడాది పూర్తి అయిన కూడా రాజమౌళి టీం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అసలు సినిమా స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమైందా లేదా అనే విషయంలో కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇక రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్లో లేదా ఆ తర్వాత మొదలు పెడతారు అన్నట్లుగా కొన్ని గాసిప్స్ మాత్రమే వినిపించాయి. ఇక రూమర్స్ ఎన్ని వస్తున్నా రాజమౌళి మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు.

ఇక మహేష్ బాబు కూడా ఇప్పటివరకు దాని మీద చిన్న మాట కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. తప్పకుండా ఈ సినిమా ఈవెంట్ లో మాత్రం ఏదో ఒక అప్డేట్ ఇస్తారు అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వేడుకలో అయితే మహేష్ లేదా రాజమౌళి ఏదో ఒక చిన్న అప్డేట్ అయితే ఇవ్వాలి.

లేదంటే ఫ్యాన్స్ మాత్రం గోల గోల చేస్తారు అని చెప్పవచ్చు. ఇక గతంలో రాజమౌళి ఇలాంటి ఈవెంట్స్ నుంచి చాలా తెలివిగా తన మాటలతో తప్పించుకున్నాడు. అయితే ఈసారి సినిమాపై ఏదైనా అప్డేట్ ఇస్తాడా లేదంటే యానిమాల్ గురించి చెప్పి ఎస్కేప్ అవుతారా? అనేది చూడాలి. మహేష్ అయితే నా చేతుల్లో ఏమి లేదు అంతా రాజమౌళి గారి చేతుల్లోనే ఉంది అని చెప్పవచ్చు. ఇక కనీసం ఈవెంట్ లో ఉండే యాంకర్ అయినా ఈ కాంబో గురించి ఏదైనా అప్డేట్ అడుగుతారేమో చూడాలి.