Begin typing your search above and press return to search.

మహేష్ రాజమౌళి.. 3 ఏళ్లు మొదటి భాగానికే..?

ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ ఫైనల్ కాగా మహేష్ తో కలిసి డిస్కస్ చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే అని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   25 Dec 2023 5:30 PM GMT
మహేష్ రాజమౌళి.. 3 ఏళ్లు మొదటి భాగానికే..?
X

సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. RRR తో గ్లోబల్ వైజ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి మహేష్ సినిమాను ఒక అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ముహూర్త కార్యక్రమం త్వరలో చేస్తారని తెలుస్తుంది. రాజమౌళి సినిమా అంటే హీరోలు ఏళ్లకు ఏళ్లు తమ డేట్స్ ఇచ్చేయాల్సిందే.

ఈ క్రమంలో మహేష్ కూడా దాదాపు 3 ఏళ్ల పాటు తన డేట్స్ అన్ని జక్కన్న సినిమాకే ఇచ్చేశాడని టాక్. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ ఫైనల్ కాగా మహేష్ తో కలిసి డిస్కస్ చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే అని తెలుస్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కించే ఈ సినిమా మొదటి పార్ట్ కోసమే దాదాపు 3 ఏళ్లు టైం తీసుకుంటారని తెలుస్తుంది. అంటే 2024 లో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ 2027 లో అది కూడా మొదటి పార్ట్ రిలీజ్ చేస్తారని టాక్.

ఇక రెండో పార్ట్ కి మరో రెండేళ్లు అంటే 2029 సో మహేష్ రాజమౌళి సినిమా కోసం మొత్తం ఐదారేళ్లు రాసిచ్చేస్తాడని చెప్పొచ్చు. RRR తో మిస్సైన మరికొన్ని అవార్డులను మహేష్ సినిమాతో టార్గెట్ పెట్టాడు జక్కన్న. అందుకే ఆయన సినిమాలు తీయడం కాస్త టైం తీసుకున్నా టార్గెట్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. కేవలం తెలుగు సినిమాలతోనే సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ అటెంప్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ నే కాదు ఇండియన్ సినీ ఆడియన్స్ అందరినీ కాలర్ ఎగరేసేలా చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ కూడా రాజమౌళి సినిమాకు కావాల్సిన బాడీ షేప్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు కావాల్సిన వర్క్ షాప్ మొదలవుతుందని తెలుస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా వస్తున్న మహేష్ 29వ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాతో సంక్రాంతికి వస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొనే ప్లానింగ్ లో ఉన్నాడు మహేష్.