Begin typing your search above and press return to search.

ప్యారిస్ లో ఫ్యామిలీతో ఫ్యామిలీ మ్యాన్!

ఆ అనుభూతుల్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమా నులతో పంచుకుంటారు. తాజాగా ఓ త్రోబ్యాక్ పిక్ ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది. మ‌హేష్ కుటుంబంతో ప్యారిస్ టూర్ వెళ్లిన ఫోటో ఇది.

By:  Tupaki Desk   |   23 Nov 2023 1:25 PM GMT
ప్యారిస్ లో ఫ్యామిలీతో ఫ్యామిలీ మ్యాన్!
X

సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీకిచ్చే ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాళీ దొరికితే కుటుంబ స‌మే తంగా విదేశాల‌కు ప్లైట్ ఎక్కేస్తారు. ఎంచ‌క్కా వారం ప‌ది రోజులు విదేశీ అందాల్ని ఆస్వాదించి ల్యాండ్ అయిపోతుంటారు. ఏడాదిలో క‌నీసం ఆరేడు సార్లు అయినా ఇలా వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం మ‌హేష్ ప్యామిలీకి ఓ అల‌వాటు లాంటింది. ఆ ర‌కంగానూ మ‌హేష్ సెల‌బ్రిటీ స్టార్స్ లో రికార్డు సృష్టించారు.

మ‌హేష్ ప్యామిలీలా టాలీవుడ్ లో ఏ హీరో కూడా వెకేష‌న్లు ప్లాన్ చేయ‌రు. ఇక త‌రుచుగా మ‌హేష్ వెళ్లేది ఎక్కువ‌గా ప్యారిస్. అక్క‌డైతే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని..బాగా తెలిసిన సిటీ కావ‌డంతో అక్క‌డ నుంచే ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్లే ప్తాన్ చేస్తుంటారు. ఆ అనుభూతుల్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమా నులతో పంచుకుంటారు. తాజాగా ఓ త్రోబ్యాక్ పిక్ ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ అవుతుంది. మ‌హేష్ కుటుంబంతో ప్యారిస్ టూర్ వెళ్లిన ఫోటో ఇది.

ఓ రెస్టారెంట్ లో కుటుబ‌మంతా క‌లిసి ఒకే టేబుల్ పై లంచ్ చేస్తోన్న పిక్ ఇది. మ‌హేష్ కి ఓవైపున గౌత‌మ్..మ‌రోవైపున సితార కూర్చున్నారు. ఎదురుగా న‌మ్ర‌త కూర్చున్నారు. ఈ అంద‌మైన ప్యామిలీని ఇలా కెమెరాలో బంధించారు. ఆ స‌మ‌యంలో అంతా ముందుకు ఒంగి మ‌రి ఫోజులిచ్చారు. వెనుక వెయిటర్ థ‌మ్స్ అప్ సింబ‌ల్ తో నేను ఉన్నాను బాస్ అంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

గ‌తంలో ఇదే సిరీస్ నుంచి కొన్ని ఫోటోల్ని న‌మ్ర‌త పోస్ట్ చేసారు. తాజాగా మ‌హేష్ ఖాతా నుంచి లీకైన పిక్ ఇది. ప్ర‌స్తుతం మ‌హేష్ గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రాన్ని సంక్రాంతి కానుంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. దినిలో భాగంగా షూట్ ని పూర్తిచేసే ప‌నిలో అంతా నిమ‌గ్న‌మ‌య్యారు. 2024 లో రాజ‌మౌళి సినిమాతో మ‌హేష్ బిజీ అవుతారు.