Begin typing your search above and press return to search.

మెగా డైలాగ్ గురించి మహేష్‌ బాబు..!

తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నాకు ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్‌ గారు ఆ డైలాగ్ ను పెట్టాలని అనుకున్నప్పుడు నేను వెంటనే ఓకే చెప్పాను.

By:  Tupaki Desk   |   17 Jan 2024 5:00 AM GMT
మెగా డైలాగ్ గురించి మహేష్‌ బాబు..!
X

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా సక్సెస్ నేపథ్యంలో యూనిట్‌ సభ్యులకు మహేష్‌ బాబు పెద్ద పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే.

సినిమా విడుదలకు ముందు పెద్దగా మీడియా ముందుకు రాని మహేష్‌ బాబు విడుదల తర్వాత శ్రీలీలతో కలిసి సుమ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుంటూరు కారం సినిమాలో చిరంజీవి స్వయంకృషి డైలాగ్‌ వచ్చిన సమయంలో ప్రేక్షకుల రియాక్షన్ పై చర్చ జరుగుతోంది.

తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నాకు ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్‌ గారు ఆ డైలాగ్ ను పెట్టాలని అనుకున్నప్పుడు నేను వెంటనే ఓకే చెప్పాను. కచ్చితంగా ఈ డైలాగ్ ను సినిమాలో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఇష్టపడుతారని భావించాను.

నేను సంధ్య థియేటర్ లో సినిమా చూసిన సమయంలో చిరంజీవి గారి డైలాగ్ వచ్చిన సమయంలో ప్రేక్షకుల నుంచి నేను అనుకున్న స్థాయిలోనే రెస్పాన్స్ వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. చిరంజీవి గారు అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన డైలాగ్ ను నా సినిమాలో పెట్టుకోవడం గౌరవంగా భావిస్తాను అని కూడా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.