Begin typing your search above and press return to search.

#ఎస్ ఎస్ ఎంబీ 29 లో మ‌హేష్ ఇలా ఉంటాడా?

దీంతో మ‌హేష్ మేకోవ‌ర్ పూర్తిగా కొత్త‌గా ఉంటుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.

By:  Tupaki Desk   |   12 April 2024 6:17 AM GMT
#ఎస్ ఎస్ ఎంబీ 29 లో మ‌హేష్ ఇలా ఉంటాడా?
X

ఎస్ ఎస్ ఎంబీ 29 లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ న్యూలుక్ ఎలా ఉండ‌బోతుంది? రాజ‌మౌళి మ‌హేష్ ని ఎలాంటి లుక్ లో చూపించ‌బోతున్నాడు? అని ప్రేక్ష‌కాభిమానులంతా ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కోసం జపాన్ లో వారం రోజుల పాటు ప్ర‌త్యేక‌మైన ట్రైనింగ్ తీసుకున్నారు. రాజ‌మౌళి అదేశించిన నాటి నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారు. బేసిక్ గానే చాలా ప‌రిమితంగానే ఆహారం తీసుకుంటారు. అందులోనూ ఇప్పుడు రాజ‌మౌళి సూచించ‌డంతో డైట్ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా ఉంటున్నారు.

దీంతో మ‌హేష్ మేకోవ‌ర్ పూర్తిగా కొత్త‌గా ఉంటుంద‌ని అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. హెయిర్ స్టైల్ ప‌రంగా మ‌హేష్ ని ఎలా చూపించ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. `స‌ర్కారు వారి పాట‌`..`గుంటూరు కారం చిత్రాల్లో ఒకే ర‌కం హెయిర్ స్టైల్లో క‌నిపించారు. లుక్ ప‌రంగా ఆ రెండు చిత్రాల్లో పెద్ద‌గా మార్పుల్లేవ్. అయితే తాజాగా న్యూజిలాండ్ వెకేష‌న్ లో మ‌హేష్ న్యూలుక్ ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇందులో మునుప‌టి కంటే మ‌రింత ఒత్తుగా లాంగ్ హెయిర్ లో క‌నిపిస్తున్నారు. అలాగే ముఖంలో కొన్ని ర‌కాల మార్పులు క‌నిపిస్తున్నాయి.

త‌ల‌పై బ్రాండెడ్ క్యాప్ ధ‌రించ‌డంతో ఫేస్ ఎలా ఉంది? అన్న దానిపై క్లారిటీ దొర‌క‌డం లేదు. మ‌హేష్ ఒడిలో కుమార్తె సితార కూడా ఉన్నారు. దీంతో మ‌హేష్ ముందు భాగ‌మంతా సితార క‌ప‌ర‌ప్ చేసారు. వెకేష‌న్ కి వెళ్లి కొన్ని రోజులు గ‌డుస్తున్నా ఫ్యామిలీ కిసంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయిగానీ..మ‌హేష్ ఫోటోలు లీక్ అవ్వ‌లేదు. వెకేష‌న్ నుంచి మ‌హేష్ తొలిపిక్ ఇదేన‌ని తెలుస్తోంది. దీంతో లుక్ ప‌రంగా మ‌హేష్ చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. రాజమౌళి హీరో లుక్ అంటే నేరుగా ఆయ‌నే ప‌రిచ‌యం చేయాలి.

త‌న హీరో ఇలా ఉంటాడ‌ని ఆయ‌న అధికారికంగా చెబుతారు. అంత‌వ‌ర‌కూ హీరో లీక్ చేయ‌డానికి ఛాన్స్ ఉండ‌దు. అందుకే మ‌హేష్ ఇంత గోప్య‌త వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కుమార్తెతో క‌లిసి ఉన్నా ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.