Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : సూపర్ స్టార్‌ స్పెషల్‌ డే

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్ బాబు మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   10 Feb 2024 10:13 AM GMT
పిక్‌ టాక్ : సూపర్ స్టార్‌ స్పెషల్‌ డే
X

టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్ బాబు మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ తన స్టార్‌ డమ్‌ తో గుంటూరు కారం సినిమాకు భారీగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే.


సోషల్‌ మీడియాలో అరుదుగా ఫోటోలు షేర్‌ చేస్తూ ఉండే మహేష్ బాబు తాజాగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ లవ్లీ ఫోటోను షేర్‌ చేశాడు. నమ్రత తో ప్రేమలో ఉన్నప్పుడు మహేష్ బాబు తీసుకున్న ఫోటో అయ్యి ఉంటుందని చాలా మంది ఈ ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబుకు అప్పుడు ఎంత ఆప్యాయంగా నమ్రత ప్రేమను పంచిందో ఇప్పటికి కూడా అంతే స్పెషల్‌ గా మహేష్‌ బాబును నమత్ర చూసుకుంటూ ఉంటారు అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు అయిన మహేష్‌, నమ్రత ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

తాజాగా నమ్రతకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మహేష్ షేర్‌ చేసిన ఈ ఫోటో అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌ లో క్యూట్‌ అండ్‌ స్వీట్‌ కపుల్‌ జాబితాలో మహేష్ బాబు, నమ్రత జోడీ ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ ఇప్పటికే రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఎప్పుడూ లేనంత గడ్డంతో ప్రస్తుతం మహేష్ బాబు కనిపిస్తున్నాడు. అది కచ్చితంగా రాజమౌళి సినిమా కోసం టెస్ట్‌ అయ్యి ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో మహేష్‌, రాజమౌళి సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.