Begin typing your search above and press return to search.

భార్యకు మహేష్ బట్టలు కొనడట.. ఎందుకంటే..

వివరాళ్లోకి వెళితే.. సిల్వర్​ స్ర్రీన్​పై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్‌బాబు - నమ్రత శిరోద్కర్‌ జోడీ ఒకటి

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:56 AM GMT
భార్యకు మహేష్ బట్టలు కొనడట.. ఎందుకంటే..
X

సూపర్​ స్టార్ మహేశ్ బాబు.. నమ్రత కోసం ఎప్పుడైన బట్టలు కొన్నారా? నమ్రత ధరించే డ్రెస్సింగ్​ వెనక మహేశ్ సెలక్షన్​ ఉంటుందా? అంటే దానికి తాజాగా సమాధానం చెప్పారు మహేశ్​. ప్రస్తుతం సూపర్ స్టార్​ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ ఆన్సర్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ​

వివరాళ్లోకి వెళితే.. సిల్వర్​ స్ర్రీన్​పై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్‌బాబు - నమ్రత శిరోద్కర్‌ జోడీ ఒకటి. టాలీవుడ్​ క్యూట్​ కపుల్​గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. అయితే వీరిద్దరి కలిసి ఒకేసారి మీడియా ముందుకు రావడం, బయట సంబంధించిన ఒకే ఈవెంట్లలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

తాజాగా ఈ ఇద్దరు కలిసి ఓ డిజైనర్ షార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సందడి చేశారు. జూబిలీ హిల్స్​లోని తమ స్నేహితుల డిజైనర్ షాప్ ఓపెన్ చెయ్యడానికి ఇద్దరూ కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నమ్రతకు.. ఎప్పుడైనా మీరు ఏమైనా బట్టలు కొన్నారా అని ఓ విలేకరి అడగగా.. మహేశ్​ బాబు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. "లేదు, నేను ఎప్పుడూ కొనలేదు. ఎందుకంటే నాకు అంతగా సెలక్షన్ రాదు. ఇంకా చెప్పాలంటే, నా బట్టలు కూడా నమ్రతనే షాపింగ్ చేస్తుంది. అన్నీ తనే చేస్తుంది" అని చెప్పారు మహేశ్​ బాబు.

ఇకపోతే కేవలం తన స్నేహితుల కోసం తాను ఈ షాపు ఓపెనింగ్​ వచ్చానని, ఇది తన బ్రాండింగ్​లో పార్టు కాదని తెలిపారు మహేశ్​. తాను నటిస్తున్న సినిమాల గురించి అప్డేట్స్ తర్వాత చెబుతానని అన్నారు. ప్రస్తుతం మహేశ్​ బాబు 'గుంటూరు కారం' షూటింగ్​తో బిజీగా గడుపుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో మహేశ్​.. దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇది సెట్స్​పైకి వెళ్లనుంది. అడ్వేంచర్​ డ్రామాగా ఇది రూపుదిద్దుకుంటోంది.