Begin typing your search above and press return to search.

అయ్య బాబోయ్ మహేష్ ఈ సినిమాలు చేసుంటే..!

అయితే మహేష్ ఖాతాలో హిట్ సినిమాలతో పాటుగా వదిలేసుకున్న సినిమాల లెక్క కూడా బాగానే ఉంది. మహేష్ దాకా వచ్చి వెళ్లిన సినిమాలు మహేష్ కాదంటే వేరే హీరోలు చేసిన సినిమాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:47 PM GMT
అయ్య బాబోయ్ మహేష్ ఈ సినిమాలు చేసుంటే..!
X

సూపర్ స్టార్ మహేష్ హిట్ కొడితే ఆ సినిమా బాక్సాఫీస్ సౌండ్ మోత మోగాల్సిందే. ముఖ్యంగా తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడంలో ముందుంటాడు మహేష్. అయితే మహేష్ ఖాతాలో హిట్ సినిమాలతో పాటుగా వదిలేసుకున్న సినిమాల లెక్క కూడా బాగానే ఉంది. మహేష్ దాకా వచ్చి వెళ్లిన సినిమాలు మహేష్ కాదంటే వేరే హీరోలు చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ట్రెండ్ సెట్టర్ సినిమాలు కూడా ఉండటం విశేషం. మహేష్ కానీ ఆ సినిమాలు చేసుంటే రిజల్ట్ వేరే రేంజ్ లో ఉంటుంది అనుకున్న వారు ఉన్నారు.


సందీప్ వంగ డైరెక్షన్ లో త్వరలో యానిమల్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ టైం లో యానిమల్ కథ మహేష్ చేసుంటే అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మహేష్ తో సందీప్ వంగా ఒక సినిమా ప్లాన్ చేశారు. కానీ మహేష్ డేట్స్ అడ్జెస్ట్ అవ్వక సినిమా కుదరలేదు. అయితే మహేష్ కి చెప్పింది యానిమల్ కథే అని అంటున్నారు. యానిమల్ ట్రైలర్ చూశాక ఈ సినిమా మహేష్ చేసి ఉంటే మెంటల్ ఎక్కించడం పక్కా అనుకున్నారు.

ఇదే క్రమంలో దర్శకులు మహేష్ కోసం అనుకుని అతనితో చేయడం కుదరక వేరే హీరోలతో చేసిన సినిమాలు ఉన్నాయి. ఇందులో రానా తెరంగేట్రం సినిమా లీడర్ కూడా వస్తుంది. శేఖర్ కమ్ముల ఈ కథ మహేష్ కోసం అనుకున్నారట కానీ మహేష్ తో కుదరకపోవడంతో రానాతో చేశారు. సినిమా చూశాక మహేష్ చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అనుకున్నారు. ఇదే క్రమంలో ఏమాయ చేసావే సినిమా కూడా గౌతం మీనన్ ముందు మహేష్ తో చేయాలని అనుకున్నారు. కానీ తనకు ఆ లవ్ స్టోరీ వర్క్ అవుట్ అవ్వదని మహేష్ కాదనేశాడు.

నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ సూపర్ హిట్ సినిమాగా ఏమాయ చేసావే నిలిచింది. ఆ సినిమాతోనే నాగ చైతన్యతో సమంత పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా కూడా మహేష్ కాదంటేనే అల్లు అర్జున్ దగ్గరకి వెళ్లిందని తెలిసిందే. మహేష్ చేస్తే ఎలా ఉండేదో కానీ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మాత్రం అరుపులు పెట్టించాడు.

ఇవే కాదు పూరీ జగన్నాథ్ ఇడియట్ సినిమాను కూడా మహేష్ కాదన్నాడు. హీరోల ఇమేజ్ కి భిన్నంగా సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ మహేష్ తో పోకిరికి మిందు ఇడియట్ చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ కాదన్నారు. అలా మిస్సైన పూరీతో పోకిరి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు మహేష్. ఇక మురుగదాస్ సూపర్ హిట్ మూవీ గజిని సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.

మహేష్ తో ఆ ప్రయత్నం చేయాలని అనుకోగా ఆయన నో చెప్పారు. అందుకే సూర్య సినిమానే డబ్ చేసి రిలీజ్ చేశారు. గజిని అంటే సూర్యనే పర్ఫెక్ట్ అనిపించేలా అతని నటన ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలన్నీ మహేష్ కి కుదరకనో.. కాదనడం వల్లో వేరే హీరోలు చేయాల్సి వచ్చింది.

ఇడియట్, గజిని, లీడర్, ఏమాయ చేసావే, పుష్ప, యానిమల్ ఈ సినిమాలు మహేష్ చేసుంటే మాత్రం మహేష్ స్టార్డం పాన్ ఇండియా లెవెల్ లో మోత మోగిపోయేదని చెప్పొచ్చు. ఇప్పటికీ టైం మించిపోలేదు రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ రికార్డుల మీదే గురి పెట్టాడు సూపర్ స్టార్.