Begin typing your search above and press return to search.

మెగా హీరో డైలాగ్ కొట్టిన మహేష్

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నోటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక డైలాగ్ వచ్చింది. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:37 AM GMT
మెగా హీరో డైలాగ్ కొట్టిన మహేష్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాకి పర్వాలేదనే టాక్ ప్రస్తుతం వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ మెన్ షో చేశాడని, కెరియర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గుంటూరు కారం సినిమాలో కనిపించిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ డాన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.

శ్రీలీల కూడా తన డాన్స్ తో అందరిని మరోసారి ఫ్యాన్స్ గా మార్చేసుకుందనే మాట వినిపిస్తోంది యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ లేకపోయిన డాన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నోటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక డైలాగ్ వచ్చింది. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీస్ ఆఫీసర్ బ్రహ్మాజీ, మహేష్ బాబు మధ్య పోలీస్ స్టేషన్ లో సభాషణ జరుగుతున్నప్పుడు ఎవరిని చూసుకొనిరా అంత బలుపు నీకు అంటే… మనకి ఆళ్ళని ఈళ్ళని చూసి బలుపు రాదు బాబాయ్ మనదంతా చిరంజీవి టైపు స్వయంకృషి అని డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ కి థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేయడం విశేషం.

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సినిమా ఈవెంట్స్ లోనే కాకుండా మూవీలో కూడా డైలాగ్స్ రూపంలో పాజిటివ్ నోట్ ని ఆడియన్స్ లోకి పాస్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ మధ్య మంచి బాండింగ్ ఉంది. సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా వచ్చి విషెస్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, మహేష్ మధ్య మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది.

గతంలో స్టార్ హీరోలు తమ సినిమాలలో తమ గురించి, ఫ్యామిలీ చరిత్రల గురించి డైలాగ్స్ ఉండేలా చూసుకునేవారు. ఇప్పుడు అయితే మరొక హీరోని పొగడటానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. సినిమా బాగుంటే సోషల్ మీడియా ద్వారా వారిని పొగడటమే కాకుండా ఇలా సినిమాలో కూడా పెట్టడం నిజంగా గ్రేట్ అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో దీనికి కొనసాగింపుగా మల్టీ స్టారర్ చిత్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.