Begin typing your search above and press return to search.

పిల్లలతో మ‌హేష్‌ లండన్‌ విహారయాత్ర

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో శిల్పా ఈ ఫోటోని షేర్ చేస్తూ..''ఫ్యామిలీ #మెమోరీస్ #లండన్'' అని రాశారు. ఫోటోలో శిల్పా, మహేష్ బాబు, నమ్ర‌త, సితార, గౌత‌మ్ కనిపించారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:05 AM GMT
పిల్లలతో మ‌హేష్‌ లండన్‌ విహారయాత్ర
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ వృత్తిగ‌త జీవితాన్ని, కుటుంబాన్ని స‌మ‌తూకం వేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. బిజీ లైఫ్ ఉన్నా తన ఫ్యామిలీతో ఎక్కువ‌ సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు. తరచుగా వెకేష‌న్స్ లో త‌న కుటుంబంతో క‌లిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తుంటారు. ఇప్పుడు అతడు లండన్‌లో వాకేని ఎంజాయ్ చేస్తున్న ఫోటో వైరల్‌గా మారింది. నమ్ర‌త‌ శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ ఈ ఫోటోను షేర్ చేసారు.


తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో శిల్పా ఈ ఫోటోని షేర్ చేస్తూ..''ఫ్యామిలీ #మెమోరీస్ #లండన్'' అని రాశారు. ఫోటోలో శిల్పా, మహేష్ బాబు, నమ్ర‌త, సితార, గౌత‌మ్ కనిపించారు. కొద్దిసేపటికే అభిమానుల్లో ఇది వైర‌ల్ గా మారింది. మ‌హేష్ కుటుంబ జీవితంపై ప్రశంస‌లు కురుస్తున్నాయి. ఒక అభిమాని 'సితార చాలా అందంగా ఉంది' అని రాశాడు. మరొకరు ''అందమైన కుటుంబం'' అని రాశారు.

మ‌హేష్ బాబు ఇంట ఒక ముఖ్యమైన వేడుక జ‌ర‌గాల్సి ఉందని ఇంత‌కుముందు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. చాలా కాలంగా సితార సాంప్రదాయక హాఫ్-చీర ఫంక్షన్ కల నెర‌వేర‌లేదు. ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల మహేష్ బాబు మొదట ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడానికి వెనుకాడారు. ఫలితంగా ఆలస్యం అయింది. ఈ ముఖ్యమైన సందర్భానికి ఉత్ప్రేరకం మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి హృదయపూర్వక కోరిక నుండి ఉద్భవించింది. ఇందిరాదేవి చనిపోయే ముందు సితార హాఫ్ శారీ వేడుకను చూసేందుకు ఆరాటపడ్డారు. కానీ అది వీలుప‌డ‌లేదు. అయితే తల్లి మరణానంతరం మహేష్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు స్పష్టమైంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. మహేష్ బాబు ప్రధాన పాత్రలో మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ చిత్రం 'గుంటూరు కారం' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవల మేక‌ర్స్ ఈ చిత్రం మొదటి సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలోని మొదటి పాటను దసరాకి విడుదల చేస్తారని ప్రచారం జరిగింది.

అయితే తాజా బజ్ ప్రకారం నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ సింగిల్‌ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. డిసెంబర్ మొదటి వారం నాటికి గుంటూరు కారం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.