Begin typing your search above and press return to search.

కారం కారంగా '1-నేనొక్క‌డినే' జ్ఞాప‌కాలు

1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ ఎంతో ఎమోష‌న‌ల్ అయింది. త‌న కెరీర్ జ‌ర్నీ ప్రారంభ‌మైంది మ‌హేష్ సినిమాతో

By:  Tupaki Desk   |   10 Jan 2024 2:28 PM GMT
కారం కారంగా 1-నేనొక్క‌డినే జ్ఞాప‌కాలు
X

1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ ఎంతో ఎమోష‌న‌ల్ అయింది. త‌న కెరీర్ జ‌ర్నీ ప్రారంభ‌మైంది మ‌హేష్ సినిమాతో. అందుకే గుంటూరు కారం సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, కృతి త‌న మొద‌టి చిత్రాన్ని త‌ల‌చుకోవ‌డం ఫ్యాన్స్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. వ‌న్ సినిమాని త‌ల‌చి కృతి ఎంతో ఎమోష‌న‌ల్ అయింది.


కృతి సనన్ కెరీర్ ప‌రంగా చాలా ఎత్తుకు ఎదిగింది. చాలా దూరం ప్ర‌యాణించింది. చివరిగా 'గణపత్: ఎ హీరో ఈజ్ బోర్న్'లో కనిపించింది. '1: నేనొక్కడినే' చిత్రం విడుదలై బుధవారంతో 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకుంది. కెరీర్ ఆరంభ‌మే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన న‌టించే అవ‌కాశం ద‌క్క‌డంపైనా కృతి చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.

తన ప్రయాణానికి నాస్టాల్జియా టచ్ ని జోడిస్తూ కృతి ఇటీవల మహేష్ బాబును కలిసింది. 1-నేనొక్క‌డినే నాటి జ్ఞాప‌కాల‌ను రివైండ్ చేస్కుంది. ప‌దేళ్ల నాటి సినిమా గురించి త‌ల‌చుకోవ‌డం గుర్తు చేసుకోవ‌డం వ‌గైరా విష‌యాలు ఉత్కంఠ‌ను క‌లిగించాయి.

త‌న తొలి చిత్రంపై ఇన్ స్టా వేదిక‌గా కృతి ఇలా రాసింది. ''నా మొట్టమొదటి సినిమాకి 10 సంవత్సరాలు అయ్యింది. నా మొట్టమొదటి సహనటుడు మ‌హేష్ సార్‌తో నా మొదటి తెలుగు చిత్రం!! నా హృదయంలో చాలా జ్ఞాపకాలు.. చాలా కృతజ్ఞత! ఎంతో మనోహరంగా.. వ్యామోహంతో..యుగయుగాల తర్వాత మిమ్మల్ని మళ్లీ కలుస్తున్నాను! చాలా మారిపోయింది కానీ ఇప్పటికీ అలాగే ఉంది'' అని రాసింది. మ‌హేష్‌, న‌మ్ర‌త‌తో క‌లిసి ఉన్న ఓ ఫోటోని కృతి షేర్ చేసింది. న‌మ్ర‌త‌తో ఉన్న ఫోటోకి కృతి మ‌రో వ్యాఖ్య‌ను జోడించింది. ''10 సంవత్సరాల శుభాకాంక్షలు!.. #1నేనొక్కడినే... ఇప్ప‌టికి ఒక దశాబ్దం అని నమ్మలేకపోతున్నాను!! మిస్ యూ @అర్యసుక్కు సార్! ఉత్తమ అరంగేట్ర అవ‌కాశం క‌ల్పించినందుకు ధన్యవాదాలు'' అని రాసింది. 1 నేనొక్క‌డినే ఫ్లాపైనా కానీ కృతి స‌నోన్ న‌ట‌న‌కు ఈజ్ కి మంచి పేరొచ్చింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. .షాహిద్ కపూర్ సరసన పేరులేని చిత్రంలో కృతి న‌టిస్తోంది. కరీనా కపూర్, టబుతో కలిసి కనిపించబోయే 'ది క్రూ'.. అలాగే త‌న‌ ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం 'దో పట్టి' కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.