Begin typing your search above and press return to search.

మహేశ్- జక్కన్న.. ఇంకా ముందుగానే..

ఇక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని తెలిపారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:21 AM GMT
మహేశ్- జక్కన్న.. ఇంకా ముందుగానే..
X

సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ సినిమా బడా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు రాజమౌళి ఇటీవలే చెప్పారు. ఇక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని తెలిపారు.

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేసియా బ్యూటీని తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మహేశ్.. జర్మనీ వెళ్లి ట్రెక్కింగ్ నేర్చుకుని వచ్చినట్లు కూడా తెలిసింది. రాజమౌళి ఈ సినిమా కోసం తన టెక్నికల్ టీమ్ లో భారీ మార్పులు చేశారని సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ పట్టాలెక్కనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

అయితే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చే ఏడాది మేలో మహేశ్- రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముందని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే ఏడాది అంటే 2025 మేలో షూటింగ్ మొదలవుతుందని అంతా అనుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు.

కానీ గోపాల్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ లో ఆ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వచ్చే సంవత్సరం అని తెలిపారు. అంటే 2024నే అని అర్థం. ఈ చిన్న క్లారిటీతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాస్త కన్ఫ్యూజ్ అయినా ఇప్పుడు ఓకే అని అంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ మూవీ గురించి చర్చించుకునేందుకు హీరో మహేశ్, డైరెక్టర్ రాజమౌళి త్వరలోనే కలవనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్, కాస్టింగ్ తోపాటు ఇతర అంశాలపై మాట్లాడుకోనున్నారు. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ కీరవాణి.. ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. మహేశ్ బాబులోని మహా, రాజమౌళిలో రాజా తీసుకుని మహారాజాగా టైటిల్ పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మరి ఈ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.